![Prudhvi Raj: నటుడు పృథ్వీ రాజ్ పొలిటికల్ పంచ్లు.. లైలా సినిమాకు డ్యామేజ్ కానుందా?](https://static.v6velugu.com/uploads/2025/02/boycott-laila-trends-as-prudhvi-raj-remark-sparks-political-controversy_iLIv8TeqNz.jpg)
విశ్వక్ సేన్ లైలా ఈవెంట్..ఇపుడు పొలిటికల్ వార్గా మారనున్నట్లు తెలుస్తోంది. నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
'మేకల సత్యం దగ్గర మొదట 150 మేకలు ఉన్నాయని.. ఇక గ్యాప్ ఇచ్చి లెక్కిస్తే కరెక్ట్గా 11 ఉన్నాయని" పృథ్వీ రాజ్ కామెంట్స్ చేశాడు.
అయితే, పృథ్వీ రాజ్ లైలా సినిమాలో జరిగే ఓ సందర్భాన్ని గుర్తుచేసినట్లు మాట్లాడుతూనే.. తమ పార్టీని ఉద్దేశించి మాట్లాడారని వైసీపీ పార్టీ శ్రేణులు BoycottLaila అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియా ఆంత పృథ్వీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ | BoycottLaila: బాయ్ కాట్ లైలా మూవీ : 11మేకలే మిగిలాయ్ అంటూ పృథ్వీ వ్యాఖ్యలతో పొలిటికల్ వార్
ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈవెంట్లో సైతం పృథ్వీ రాజ్ తనదైన సెటైర్లు వేశాడు." మొన్న ఓ సినిమాలో చెప్పా.. అసలే పవర్లో లేం. మనకు కేవలం 11 వచ్చినవి. అందువల్ల ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు వేస్తానంటూ" మాట్లాడారు. అప్పుడు కూడా పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
దాంతో గేమ్ ఛేంజర్ సినిమాకు బాగా ఎఫెక్ట్ పడింది. ఇక ఈ లేటెస్ట్ కామెంట్స్ లైలా సినిమాకు భారీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక కొందరు వైసీపీ పార్టీ అభిమానులు హీరో విశ్వక్ సేన్ను ఉద్దేశించి ట్వీట్స్ పెడుతున్నాడు.
'మీ లైఫ్ లో చూడని నెగెటివిటీ ఈ సినిమాకి చూస్తావ్.. మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు.. మర్యాదగా అతనితో క్షమాపణ చెప్పిస్తే సరి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొన్న గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడు చూసారుగా..
— NARUTO (@NarutoReddy17) February 9, 2025
మళ్ళీ వాడిని తీస్కోని వచ్చి ఎక్స్ట్రాలు చేసార్రు..
ఈసారి కూడా boycott చేస్తే ఎలా ఉంటాడో చూస్తారు.🤫
Come on #YSRCPSM 💥#BoycottLaila #DondaKayaKiranRoyal
#BoycottLaila pic.twitter.com/1SatmAIRw5
అలాగే ఒక సినిమా తీయాలంటే డబ్బుతో పాటు ఎంతోమంది కష్టపడతారు. అలంటి సినిమా ఫంక్షన్కి వచ్చి రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు అవసరం? రాజకీయాలు మాట్లాడితే మేము ఇలానే రియాక్ట్ అవుతాం అంటూ మరికొందరు అంటున్నారు. మరి ఈ రచ్చ ఎక్కడివరకు వెళ్లనుందో.. సినిమా ఫలితాన్ని ఎలా మార్చానుందో చూడాలి.
ఒక సినిమా తీయాలంటే డబ్బుతో పాటు ఎంతోమంది కష్టపడతారు..
— Krishna Reddy 🇮🇳🇲🇾🇸🇬🇮🇩🇹🇭 (@Krishnacrkr0426) February 9, 2025
మేము ఏదైనా అంటే నీతులు చెప్తారు.. వీడికి రాజకీయాల అవసరమా..
మూవీ ఫంక్షన్ కి వచ్చినాడు మూవీ గురించి మాట్లాడాలి. @VishwakSenActor
రాజకీయాలు మాట్లాడితే మేము ఇలానే రియాక్ట్ అవుతాం..#boycottlaila
pic.twitter.com/CAYAd5jo8Y
గతంలో పృథ్వీ రాజ్ వైసీపీలో ఉంటూ ఎస్వీబీసీ ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఇక అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు.
Dear #YSRCPSOCIALMEDIA
— Reddy_Community (@Reddy_Community) February 9, 2025
మళ్లీ మన పవర్ ఏంటో చూపిద్దాం✊🔥#Laila మూవీ కి మనం డ్యూటీ చేస్తున్నాం అంతే 💯🤙#boycottlaila @VishwakSenActor pic.twitter.com/LppugwEKzk