పెళ్లి కావాలి.. ప్రియుడి ఇంటిముందు ధర్నా

ప్రేమించానని వెంట పడ్డాడు.. తీరా సరే అన్నాక.. పెళ్లికి మొహం చాటేశాడు ఓ యువకుడు. వారిద్ధరి ప్రేమ కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలని.. ఒకరిపేరు మరొకరు పచ్చబొట్టు వేసుకున్నారు. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి మాట ఎత్తగానే ప్రియురాలికి కనిపించకుండా పోయాడు ప్రియుడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజు ఇంటి ముందు ప్రియురాలు మౌనిక న్యాయ పోరాటానికి దిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తూజాల్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

దోమకొండకు చెందిన మౌనిక డిగ్రీ చదువుతున్న సమయంలో నాగరాజు గౌడ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వారిద్ధరూ కలకాలం ఒకటిగా ఉండాలని.. మౌనిక నాగరాజుని పెళ్లి చేసుకొమని అడిగింది. కానీ నాగరాజు పెళ్లి చేసుకోనని మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు నాగరాజు ఇంటిముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది.