ఆరుగురి మిస్సింగ్ కేసు సుఖాంతం..విజయవాడలో గుర్తించిన పోలీసులు 

ఆరుగురి మిస్సింగ్ కేసు సుఖాంతం..విజయవాడలో గుర్తించిన పోలీసులు 

పద్మారావునగర్​,వెలుగు : ఆరుగురి మిస్సింగ్​ కేసును బోయిన్ పల్లి పోలీసులు చేధించారు. న్యూబోయిన్​పల్లి ఏడుగుళ్ళ సమీపంలో మహేశ్, ఉమా దంపతులు తమ పిల్లలైన రిషి, చైతు,శివన్​తో ఉంటున్నారు. మహేశ్​ నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ . ఇదే ప్రాంతంలో ఉండే వీరి బంధువు సంధ్య శుక్రవారం వీరి ఇంటికి వచ్చింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు బిక్షపతి.. మహేశ్​ఇంటికి రాగా ఎవరూ కనిపించలేదు.

ఇంటి యజమానిని వాకబు చేయగా అందరూ బయటకు వెళ్లినట్లు తెలిసింది. అర్ధరాత్రి అయినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేయగా ఆటోలో ఎంజీబీఎస్​ కు,  అక్కడి నుంచి విజయవాడకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో విజయవాడ వెళ్లి ఆరుగురిని బోయిన్​పల్లి పీఎస్​కు తీసుకువచ్చారు. కుటుంబ తగాదాల కారణంగానే ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లినట్టు చెప్పారు.