Good Health: పొద్దున్నే ఇది తాగండి ...షుగర్, బీపీ కంట్రోల్​ అవుతాయట..!

Good Health:  పొద్దున్నే ఇది తాగండి ...షుగర్, బీపీ కంట్రోల్​ అవుతాయట..!

తెల్లారిందంటే చాలు... బెడ్​ పైనే కాఫీకాని.. టీ కాని అందుకుంటారు. అది కడుపులో పడితే కాని పనులు మొదలు పెట్టరు .  అంటే పొద్దున్నే ఛాయ్​ .. కాఫీకి ఎంత డిమాండ్​ ఉందో ఇక వేరే చెప్పక్కర్లేదు. అయితే హైటెక్​ యుగంలో కాఫీ..టీ తాగడం వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్నాయి.  దీంతో జనాలు హెర్చల్​ టీలను అలవాటు చేసుకుంటున్నారు.  లెమన్​ టీ.. జింజర్​టీ.. ఇలా అనేక రకాల టీలను జనాలు సేవిస్తున్నారు.  వీటన్నిటికంటే హైబిస్కస్​ హెర్బల్​ టీ ఆరోగ్యానికి  చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.    ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.. .

ఇప్పుడు జనాలు బిజీ లైఫ్​ గడుపుతున్నారు.. కనీసం సరిగా తిండి కూడా తినడంలేదు.  దీని వలన గ్యాస్టిక్​ ట్రబుల్​ తో జనాలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.వీటితో షుగర్​.. బీపీ  ఈ రెండు జనాలను పీక్కుతింటున్నాయి. ఇలాంటి వాటిని పొద్దున్నే మందార టీ తాగితే చెక్​ పెట్టొచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

హైబిస్కస్​ టీ అంటే మందార పూలతో తయారు చేసే టీ.  ఇందులో విటమిన్​ సీ.. యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  మందార పూలతో చేసిన టీ కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మందార పువ్వు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మందారంలో పాలీఫెనాల్స్, ఆల్ఫా-గ్లూకోసిడేస్, ఆల్ఫా-అమైలేస్ వంటి ఎంజైములు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 

  రెగ్యులర్​ కాఫీ..ఛాయ్​ లు తాగితే  ఆక లిలేకుండా చేసి.. జీర్ణక్రియ సమస్యలతో పాటు కొవ్వు పేరుకుపోయే అవకాశంఉంది. మందార టీ వలన జీర్ణక్రియ వృద్ది చెందడమే కాకుండా.. ప్యాంక్రియాటిక్ లైపేస్ వంటి ఎంజైమ్‌లను తొలగించడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.మందార టీలో  ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.  మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.. ఇది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది.

ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది.  చాలామంది వేడి తీవ్రత వలన చర్మంపై మొటిమలు, కురుపులు మొదలైన వాటితో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇందులో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కాలానుగుణ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  

ALSO READ : టేస్టీ ఫుడ్​.. సమ్మర్​ ఫుడ్​.. కీరాతో అదిరిపోయే వంటకాలు.. ఇలా ట్రై చేయండి .. పిల్లలు ఇష్టంగా తింటారు

మందారంలో  ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్  ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మందార టీ తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు, అలసట, ఉద్రిక్తత తగ్గుతాయి. వ్యాధి కారక బ్యాక్టీరియాతో మందార టీ పోరాడుతుంది. కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది. మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే మందార టీ తాగాలి. ఇది మీ జుట్టును అందంగా, బలంగా చేస్తుంది. అందుకే పూర్వకాలంలో మందార ఆకులనుంచి తీసిన నూనెను తలకు రాసుకొనేవారు.