సాధారణంగా మనం రోజు తినే కూరల్లో ఇతర ఆహార పదార్థాల్లో కారం పొడిని ఉపయోగిస్తుంటాం. ఇది లేకుండా ఏ కూర ఉండదు. అయితే మితంగా తినండి.. ఎక్కు వగా తినొద్దు.. కారం ఎక్కువగా తింటే కడుపులో మంట, విరేచనాలు, అల్సర్లు ఏర్పాడతాయని అంటారు. ఇది నిజమే అయినప్పటికీ ఎర్రటి మిరప కారం పొడి తగిన మోతాదులో తింటే ఆరోగ్యానికి సంబంధించిన చాలా లాభాలున్నాయని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. ఎర్ర మిరప కారం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనా లేంటో చూద్దాం..
ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ఎండు మిరపకారం ఎక్కువకగా తినేవారిలో వ్యాధుల ప్రమాదం నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఎర్ర మిరపకాయలో ఉంగే లక్ష ణాలు శరీరానికి మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది
ఎర్ర మిరపకాయ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వాపుతో పాటు కణతులను తగ్గిస్తుంది. ఈ అధ్యయంన ప్రపంచవ్యాప్తంగా సుమారు 57 వేల మంది ఆరోగ్య ఆహారపు రికార్డుల ఆధారంగా జరిగింది.
ఎండు మిర్చి పొడి ఆహారం రుచిని పెంచుతుంది. అదే సమయంలో ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలుఅంటున్నారు. అధిక ఉప్పు వినియోగం రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. అయితే రెడీమేడ్ చిల్లీ సాస్, మిక్స్డ్ మసాలాలు తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సోడియం అధికంగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు.
గుండె, క్యాన్సర్ నిరోధకంగా..
ఎర్ర మిరప కారం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఒక వ్యక్తి క్రమం తప్రకుండా కారం పొడిని తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించవచ్చని వర్చువల్ కాన్ఫరెన్స్ సైంటిఫిక్ సెషన్ 2020లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక పరిశోధన ద్వారా ధృవీకరించింది.
ఎండు మిర్చికారంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయట. ఈ లక్షణాల వల్ల గుండె జ బ్బు లు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
రోజుకు 12 నుంచి 15 గ్రాముల ఎర్ర మిరప కారం తినొచ్చని .. దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల అజీర్ణం , మంట, కడుపునొప్పి, విరేచనాలు సంభవిస్తాయని అంటు న్నారు. ఎర్ర మిర్చి కారంను సలాడ్ లో, కూరగాయలకు కలిపి కూడా తినొచ్చు.