ఈ రోజుల్లో బీపీ చాలా కామన్ ప్రాబ్లమ్. బీపీ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. 'అది తినాలి. ఇది తినకూడదు' అని డైట్లో ఎంతో కేర్ తీసుకుంటారు. అయితే బీపీ కోసం ప్రత్యేకించి ఒక డైట్ ఉందన్న సంగతి చాలామందికి తెలీదు. హైబీపీ ఉన్నవాళ్ల కోసం డాక్టర్లు ప్రత్యేకంగా ఒక డైట్‌ను తయారు చేశారు అదే డ్యాష్ డైట్. డ్యాష్ అంటే.. 'డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్టెన్షన్, బీపీ తగ్గించడంలో ఈ డైట్ మించింది లేదంటున్నారు డాక్టర్లు. ఈ డైట్ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం. . .
డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్' అనే 'డ్యాష్ డైట్'ను అమెరికాకు చెందిన మార్గా హెల్లర్ అనే డాక్టర్ కనిపెట్టారు. ఈ డైట్ శరీరానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగు పరచటంతోపాటు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. బీపీ రాకుండా ఉండడానికి, వచ్చాక కంట్రోల్లో ఉంచడానికి ఈ డైట్ సాయపడుతుంది. ఈ డైట్ ను అనుసరిస్తే రెండు వారాల్లోనే బ్లడ్ ప్రెషర్ 8 నుంచి 14 పాయింట్లు తగ్గినట్లు సైంటిఫిక్ గా రుజువైంది. కేవలం బీపీ మాత్రమే కాకుండా ఈ డైట్ వల్ల కొలెస్ట్రాల్, బరువు తగ్గించుకోవచ్చని ... డయాబెటిస్ ను కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.
Also Read : ఇలా చేస్తే.. ఇలా తింటే.. మీరు 40లోనూ.. 20 ఏళ్ల కుర్రోడిగా ఉంటారు..!
హైపర్ టెన్షన్ అంటే..
శరీరంలోని రక్తం కొంత ప్రెషర్ తో ప్రసరిస్తుంటుంది. రక్తంలో ఒత్తిడి సరిగా ఉంటేనే అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా చేరుతుంది. ఆ ఒత్తిడిలో ఏదైనా తేడాలొచ్చి ప్రెషర్ పెరిగితే దాన్ని 'హైపర్ టెన్షన్' అంటారు.. హైపర్ టెన్షన్ కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్ టెన్షన్ రావొచ్చు.
హైపర్ టెన్షనకు ఒత్తిడి, ఎక్కువ బరువు, నిద్ర లేకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవటం, ఉప్పు ఎక్కువగా తినడం, మద్యపానం, ధూమపానం లాంటివి కారణాలు కావొచ్చు. ఇవే కాకుండా డయాబెటిస్ ఉంటే కూడా ఆ ప్రభావం బ్లడ్ ప్రెషర్ మీద పడుతుంది. అందుకేమ హై బీపీ రాకుండా ఉండాలంటే సరైన ఆహారం, హెల్దీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాలి.
డైట్ రూల్స్ ఇవే
డ్యాష్ డైట్ లో రోజుకు ఐదు సార్లు తినాలి. రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలి. తృణ ధాన్యాలు, నట్స్, బీన్స్, చికెన్, చేపలు, రొయ్యలు, కూరగాయలు తినాలి. సోడా, ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. పొగ తాగకూడదు. రోజుకు రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఉప్పును మాత్రమే వాడాలి. రోజుకి ఒక హోల్ వీట్ బ్రెడ్ లేదా అర కప్పు బ్రౌన్ రైస్ లేదా పాస్తా తినొచ్చు.
ఇక పొటాషియం ఎంత ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు అంత కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి పొటాషియం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. రోజుకి కనీసం 2-3 కప్పుల ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు... 4-5 కప్పుల పండ్లు తినాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగులోనూ పొటాషియం ఉంటుంది.
మెగ్నీషియం తగినంత తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అందుకే టొమాటో, క్యారెట్, బ్రొకోలీ, చిలకడ దుంపలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, సోయాతో చేసిన టోపు, వెన్న తీసిన పాలు, తాజా కూరగాయలు తీసుకుంటే పీచు పదార్థాలు, విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఈ డైట్ లో పుల్లగా ఉండే నారింజ, బత్తాయిలాంటి సిట్రస్ పండ్లు కూడా తినొచ్చు
పాలు, పెరుగు, జున్నుల్లో క్యాల్షియం, విటమిన్ డీలు ఎక్కువ ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. కొవ్వు పదార్థాలు, పేస్ట్రీస్, కేన్డ్ఫిష్, మటన్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్, బీఫ్, క్యాండీలు, కుకీలు, స్వీట్లు, సోదా లాంటివి ఈ డైట్ లో తీసుకోకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా.. తినే ఆహారంతో వచ్చే క్యాలరీలు 2000 నుంచి 2500 మధ్య మాత్రమే ఉండేలా డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. చిరుతిళ్లు, పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మానెయ్యాలి.
ALSO READ | Beetroot: సూపర్ ఫుడ్ బీట్ రూట్ తో.. ఆరోగ్యానికి ఐదు లాభాలు
మాంసాహారులైతే రోజుకి 85 గ్రాముల కన్నా ఎక్కువ మాంసం తీసుకోకూడదు. రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీసుకోకూడదు. మిఠాయిలు, చాక్లెట్లు, కేకుల వంటివి తినటం తగ్గించాలి. వీటిల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ గుండెకు హాని చేసేవే.. డ్యాష్ డైట్‌ను ఫాలో అవుతూనే వాకింగ్. స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు ఇంకా తొందరగా తగ్గొచ్చు. డ్యాష్ డైటింగ్ తో పాటు లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే బీపీ, ఒబెసిటీ లాంటివి మరింత కంట్రోల్లో ఉంటాయి.
డ్యాష్ డైట్ ను ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఫాలో అవుతున్నారు. బీపీ ఉన్న వాళ్లు రాకుండా ఉండాలనుకునే వాళ్లు.. ఈ డైట్ పాటిస్తుంటారు. దీంతో బరువు పెరగడం, డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఈ డైట్ తో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ డైట్ అన్ని పోషకాలను బ్యాలెన్స్ చేస్తూనే హై బీపీ మీద ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది.
ఇందులో ముఖ్యంగా సాల్ట్ కంట్రోల్గా ఉంటుంది. డ్యాష్ వైట్ బీపీని పెంచే సోడియం తక్కువగా. బీపీను కంట్రోల్లో ఉండే పొటాషియం. క్యాల్షియం, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో మెదదు, వెంట్రుకలు. చర్మం లాంటి కొన్ని భాగాలకు కావాల్సిన క్యాల్షియం, ప్రొటీన్లు, ఫైబర్ ఈ డైట్ ద్వారా శరీరానికి అందుతాయి. దీంతో శరీరానికి పూర్తి పోషణ అందుతుందని చీఫ్ న్యూట్రిషనిస్ట్, డా. సుజాత స్టీఫెన్ అంటున్నారు. . .
-–వెలుగు,లైఫ్–