BPL 2024: మైదానంలో మాటలకు తెరలేపిన పాక్ - బంగ్లా క్రికెటర్లు

BPL 2024: మైదానంలో మాటలకు తెరలేపిన పాక్ - బంగ్లా క్రికెటర్లు

ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను మాటలతో రెచ్చగొట్టడం బంగ్లాదేశ్ క్రికెటర్లకు పరిపాటే. ఆ అలవాటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంకు కోపం తెప్పించింది. మైదానంలో ఎల్లప్పుడూ కనిపించే పాక్ మాజీ కెప్టెన్‌లో ఉన్నట్టుండి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బంగ్లా యువ వికెట్ కీపర్ ఇర్ఫాన్ సుక్కుర్‌పై అతడు మండిపడ్డాడు.

ఏం జరిగిందంటే..?

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం(జనవరి 27)  దుర్దాంటో ఢాకా, రంగపూర్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రైడర్స్ 183 పరుగులు చేయగా.. ఛేదనలో ఢాకా 104 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో రైడర్స్ బ్యాటర్  బాబర్ ఆజం.. ఢాకా వికెట్ కీపర్ ఇర్ఫాన్ సుక్కుర్‌పై మండిపడ్డాడు. అతను ఆగ్రహంతో సుక్కుర్‌ని హెచ్చరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరకు అంపైర్ జోక్యం చేసుకోవలడంతో వీరి మాటల యుధ్దం సద్దుమణిగింది. అయితే, వీరి గొడవకు కారణమేంటనేది తెలియరాలేదు. ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బంగ్లా క్రికెటరర్లపై పాక్ అభిమానుల దూషణ

ఈ గొడవను పాక్ అభిమానులు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లా క్రికెటర్లపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. వారిని హెచ్చిరిస్తు సోషమ్ మీడియాలో ఇష్టమొచ్చిన కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ ఈ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది.