
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ సంస్థ డెయిరీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్మీడియట్, లా డిగ్రీ చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు, మిగతా రెండు రకాల పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ ప్రక్రియ ఉంటుంది. ఈ జాబ్స్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు..
వేతనం: ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌కు నెలకు రూ.21,656, డెవలప్మెంట్ ఆఫీసర్‌కు రూ.18,519, కోఆర్డినేటర్‌కు రూ.15,410 బేస్ శాలరీ చెల్లిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో..
అప్లికేషన్ ఫీజు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.944, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు రూ.826, కోఆర్డినేటర్ పోస్టులకు రూ. 708 ఫీజు చెల్లించాలి.చివరి తేది: మే 10
ఎగ్జామ్ తేదీ: వెల్లడించాల్సి ఉంది.
అడ్మిట్ కార్డులు: ఎగ్జామ్‌కు 15 రోజుల ముందు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
వెబ్సైట్: www.bharatiyapashupalan.com