చిన్న పట్టణాలకు మారుతున్న పెద్ద కంపెనీలు

చిన్న పట్టణాలకు మారుతున్న పెద్ద కంపెనీలు

ఇక్కడి నుంచే ఉద్యోగుల ఎంపిక
ఖర్చు తగ్గించుకునేందుకే

న్యూఢిల్లీ: కరోనా వల్ల నష్టపోయిన సెక్టార్లలిస్టులో బిజినెస్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) కంపెనీలూ ఉన్నాయి. లాక్డౌన్‌ వల్ల వీటికి కయ్లింట్లు బాగా తగ్గారు. ప్రస్తుత కస్టమర్లు డిస్కౌంట్లు అడుగుతున్నారు. మార్జిన్ లు కూడా చాలా తగ్గాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు బీపీఓ/కాల్‌‌‌‌సెంటర్‌ కంపెనీలు సరికొత్త ప్లాన్‌‌‌‌ను అమలు చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఉద్యోగులను నియమించుకోవడానికి కొత్త విధానాన్ని ఎంచుకున్నాయి. మెట్రో నగర వాసులకు బదులు చిన్న పట్టణాల యువతకు జాబ్స్‌‌‌‌ ఇస్తున్నాయి. వర్క్‌‌‌‌ఫ్రమ్‌ హోం విషయంలో పూర్తిగా ఉబర్‌ మోడల్‌‌‌‌ను పాటిస్తున్నాయి. అంటే ‘బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ డివైజ్‌’ (బీవైఓడీ) విధానం ద్వారా పనిచేయాలి. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, రూటర్‌ వంటివి అన్నీ వాళ్లే కొనుక్కొని ఇంటి నుంచి పనిచేయాలి. దీనివల్ల కంపెనీకి చాలా డబ్బు ఆదా అవుతుంది. బీపీఓ కంపెనీలు ఇంతకు ముందు మెట్రో నగరాల నుంచి క్యాండిడేట్లను సెలెక్ట్‌ ‌‌‌చేసుకునేవి. సిటీల యువతకు ఇంగ్లీష్ పై పట్టుఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌ బాగా ఉంటాయి. ఇక నుంచి బీపీఓ కంపెనీలు ఎక్కడి నుంచైనా ఎంప్లాయిస్‌‌‌‌ను ‘బీవైఓడీ’ మోడల్‌ ద్వారా నియమించుకునే వీలు కలిగింది. కొత్త పద్ధతి వల్ల ఉద్యోగుల కోసం చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా వెళ్లే అవకాశం కలిగిందని ఢిల్లీలోని టెలీ పెర్ఫార్మెన్స్‌‌‌‌కు చెందిన ఆదిత్య అరోరా అన్నారు. తమ కంపెనీ బారాముల్లా, గుర్‌‌‌‌దాస్‌పూర్‌, ఉజ్జయిన్‌ వంటి చిన్న నగరాల, పట్టణాల యువతకు జాబ్స్‌‌‌‌ ఇచ్చిందని వివరించారు.

కరోనా తరువాత ఎన్నో మార్పులు
కరోనా రావడానికి ముందు బీపీఓ, ఐటీ కంపెనీలన్నీ మెట్రో సిటీల్లో పెద్దపెద్ద బిల్డింగుల్లో ఉండేవి. వరుసగా అమర్చిన డెస్కులపై ఉద్యోగులు కూర్చొని హెడ్‌సెట్స్‌‌‌‌ ద్వారా మాట్లాడుతూ కస్టమర్ సమస్యలను పరిష్కరించేవారు. కరోనా వచ్చాక ఇలాంటివి కనిపించడంలేదు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఆఫీసులను తప్పనిసరిగా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి బీవైఓడీ మోడల్‌లో కాల్‌‌‌‌సెంటర్లు నడుపుతున్నా ఎల్లకాలం ఈ విధానాన్ని కొనసాగించడం కష్టమని ఎక్స్‌‌‌‌పర్టులు అంటున్నారు. ఉద్యోగి.. ఆఫీసు, కస్టమర్‌ ఉన్న ప్రాంతానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. ఒక ఏడాది తరువాతే ఈ విధానంపై అంచనాకు రాగలమని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే విషయమై స్టార్‌టెక్‌‌‌‌ అనే బీపీఓ కంపెనీ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ అహుజా బీవైఓడీ మోడల్‌‌‌‌ను ఉబర్‌ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నప్పుడు, తమ వల్ల ఎందుకు కాదని ప్రశ్నించారు ? ఇక నుంచి బీపీఓ ఇండస్ట్రీ అంతా బీవైఓడీ మోడల్‌ ద్వారానే నడుస్తుందని స్పష్టం చేశారు. ‘‘చిన్న పట్టణాల్లో కంప్యూటర్లు, నెట్‌కనెక్షన్లు ఉన్న వాళ్లు దొరుకుతారా? అని మా హెచ్‌ఆర్‌ టీమ్స్‌ ‌‌‌మొదట్లో నన్ను అడిగాయి. ‘మీరు ఉబర్‌‌‌‌ను గమనించండి’ అని చెప్పాను. మా అంచనా తప్పలేదు. గత మూడు నెలల్లో మేం వెయ్యి మందిని తీసుకున్నాం’’ అని వివరించారు. టెలీపర్ఫార్మెన్స్‌‌‌‌ కూడా గత మూడు నెలల్లో బీవైఓడీ మోడల్‌ ద్వారా 12 వేల మందికి జాబ్స్ఇచ్చింది. చిన్నపట్టణాల్లోని విద్యాసంస్థల్లో క్యాంపస్‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌ ద్వారా బీపీఓ/కాల్‌‌‌‌సెంటర్‌ కంపెనీలు ఉద్యోగులను సెలెక్ట్‌‌‌‌ చేసుకుంటున్నాయి.

కంపెనీలకు ఎన్నో లాభాలు
బీవైఓడీ పద్ధతిలో చిన్న పట్టణాలకు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల కంపెనీలకు చాలా రకాలుగా మేలు జరుగుతోంది. కంప్యూటర్‌ వంటి పరికరాలు కొనివ్వాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏమీ ఇవ్వరు. జీతాలు తక్కువ ఇస్తారు. కాల్‌‌‌‌సెంటర్లలో పనిచేసే వారికి పెద్ద పెద్ద డిగ్రీల అవసరం ఉండదు. తక్కువ కంప్యూటర్‌ నాలెడ్జ్‌‌‌‌ ఉన్నా సరిపోతుంది. ‘‘ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌‌‌‌ (ఐవీఆర్‌) లెక్కలను గమనిస్తే బీపీఓలకు కాల్‌ చేసేవారిలో 30 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. 70 శాతం మంది హిందీలోనే మాట్లాడుతారు. ఇంగ్లీష్ లో మాట్లాడే ఉద్యోగులను పెద్ద నగరాల నుంచి తీసుకున్నా, మిగతా వారందరినీ చిన్న నగరాలు, పట్టణాల నుంచి సెలెక్ట్‌‌‌‌ చేసుకోవచ్చు’’ అని స్టార్‌టెక్‌ ‌‌‌అనే బీపీఓ కంపెనీ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ అహుజా వివరించారు. బీవైఓడీ బిజినెస్ మోడల్‌ సక్సెస్‌ అయితే బీపీఓ ఇండస్ట్రీ రూపురేఖలు పూర్తిగా మారుతాయని కామెంట్‌ చేశారాయన.

For More News..

గూగుల్‌ నుంచి సరికొత్త ‘కోర్మో’ జాబ్ యాప్

ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను

రెండేళ్లలో కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే 10 లక్షల మంది తగ్గుతరట