చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

జీతాల ఖర్చులు తగ్గుతాయనే

వర్క్ ఫ్రమ్ హోమ్ తో మారిన హైరింగ్ యాక్టివిటీ

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు:  వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం రెగ్యులేషన్స్‌‌‌‌ను ప్రభుత్వం సులభం చేయడంతో  చిన్న పట్టణాలలో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా చేపట్టాలని బీపీఓ కంపెనీలు భావిస్తున్నాయి. శాలరీ పరంగా కంపెనీలకు ఖర్చులు తగ్గడంతో పాటు, టైర్‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీలలో టాలెంట్‌‌‌‌ ఉన్న యువత ఎక్కువగా ఉంటారని అంటున్నాయి. అంతేకాకుండా జాబ్‌‌‌‌ మానేయడాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నాయి. కాగా, ఇండియన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌‌‌‌ సోర్సింగ్(బీపీఓ) కంపెనీలను అదర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్స్‌‌‌‌(ఓఎస్‌‌‌‌పీలు) కింద పరిగణిస్తున్నారు. దీంతో కఠినమైన ఓఎస్‌‌‌‌పీ రూల్స్‌‌‌‌ను బీపీఓలు ఫాలో కావాల్సి వస్తోంది.

కరోనా వలన ఐటీ, ఐటీ ఎనబుల్డ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ కోసం వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం రూల్స్‌‌‌‌ను డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌‌‌‌(డాట్‌‌‌‌) సులభం చేసింది. దీంతో బీపీఓ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. ఉదాహరణకు హిందుజా  గ్రూప్‌‌‌‌కు చెందిన బీపీఓ కంపెనీ హిందుజా గ్లోబల్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌(హెచ్‌‌‌‌జీఎస్‌‌‌‌) వర్క్ ఫ్రమ్  హోం మోడల్‌‌‌‌ వలన తన హైరింగ్‌‌‌‌ పద్ధతులలో మార్పులు తీసుకొచ్చింది. కరోనాకు ముందు హైదరాబాద్‌‌‌‌, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో సిటీలకు షిఫ్ట్‌‌‌‌ అయిన, షిఫ్ట్‌‌‌‌ కావడానికి రెడీగా ఉన్న టైర్‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీల ప్రజలను హైర్‌‌‌‌‌‌‌‌ చేసుకునే వాళ్లమని హెచ్‌‌‌‌జీఎస్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ సీఎఫ్‌‌‌‌ఓ శ్రీనివాస్‌‌‌‌ పాలకోడేటి అన్నారు.

ఈ సిటీలలో మా సెంటర్‌‌‌‌లు ఉండడంతో వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లమని పేర్కొన్నారు. వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం రూల్స్‌‌‌‌ను సులభం చేయడంతో చిన్న సిటీలలో హైరింగ్‌‌‌‌ చేపడతామన్నారు.  సరియైన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ ఉంటే ఎక్కడి నుంచైనా పనిచేయగలిగే వారిని నియమించుకోవాలని చూస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల కోసం మెట్రో సిటీల వైపు ఎక్కువగా చూసే హెచ్‌‌‌‌జీఎస్‌‌‌‌, ప్రస్తుతం టైర్‌‌‌‌‌‌‌‌ 2 సిటీలను పరిశీలిస్తోంది. మైసూర్‌‌‌‌‌‌‌‌, అనంతపూర్‌‌‌‌‌‌‌‌, కోలార్‌‌‌‌‌‌‌‌, సేలం, హోసూర్‌‌‌‌‌‌‌‌, మంగళూరు, హుబ్లి, తిరుపతి వంటి సిటీలలో తన హైరింగ్‌‌‌‌ యాక్టివిటీని పెంచింది.

కాంట్రాక్ట్‌‌‌‌ జాబ్ హైరింగ్‌‌‌‌ కూడా..

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఇబ్బంది పడ్డ బీపీఎం కంపెనీలు కూడా ఈ ఏడాది చివరి వరకు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం మోడల్‌‌‌‌ను కొనసాగించాలని చూస్తున్నాయి. ప్రస్తుతం చిన్న సిటీలలో కూడా టెక్నాలజీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందని, స్కిల్‌‌‌‌ ఉన్న యువత దొరుకుతున్నారని రాండ్‌‌‌‌స్టాడ్‌‌‌‌ ఇండియా డైరక్టర్‌‌‌‌‌‌‌‌ యేషబ్‌‌‌‌ అన్నారు. టైర్‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీల నుంచి హైర్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఇండియన్‌‌‌‌ స్టాఫింగ్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ లోహిత్ భాటియా చెప్పారు. శాలరీ పరంగా కంపెనీలకు కాస్ట్ తక్కువవుతుందని, జాబ్స్‌‌‌‌ను మానేయడం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

సిటీలలో లేదా సిటీకి దగ్గర్లోని కాలేజీల నుంచి ప్రతీ ఏడాది పెద్ద సంఖ్యలో కాలేజి పాస్‌‌‌‌ అవుట్‌‌‌‌లు ఉంటాయని అన్నారు. కాంట్రాక్ట్‌‌‌‌ హైరింగ్‌‌‌‌ వైపు కూడా కంపెనీలు చూస్తున్నాయని భాటియా అన్నారు. ‘ఈ విధానంలో  సరియైన టైమ్‌‌‌‌కి ఉద్యోగులను నియమించుకోవచ్చు. 60–90 రోజుల నోటీస్ పిరియడ్‌‌‌‌లు ఉండవు. దీంతో కొత్త ప్రాజెక్ట్‌‌‌‌ లేదా ప్రాక్టిస్‌‌‌‌ చేపట్టే వారికి హెల్ప్‌‌‌‌ అవుతుంది. ఉద్యోగుల్లో స్కిల్స్‌‌‌‌ లేని వారిని తొలగించడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి, ట్రై చేసి ఉద్యోగులను నియమించుకోవడానికి కాంట్రాక్ట్ జాబ్‌‌‌‌ విధానం తోడ్పడుతుంది’ అని భాటియా అభిప్రాయపడ్డారు.

బెనిఫిట్స్ ఎక్కువ..

డబ్ల్యూఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌  ఇప్పటికే టైర్‌‌‌‌‌‌‌‌ 2 సిటీలలో తన బిజినెస్‌‌‌‌ చేస్తోంది. కంపెనీకి నాసిక్‌‌‌‌, వైజాగ్‌‌‌‌ లలో డెలివరీ సెంటర్లున్నాయి. డెలివరీల పరంగా ఈ సెంటర్లు వృద్ధి చెందాయని డబ్ల్యూఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ చెబుతోంది. ‘హబ్‌‌‌‌–స్పోక్‌‌‌‌–ఎడ్జ్‌‌‌‌’ మోడల్‌‌‌‌కు నెమ్మదిగా షిఫ్ట్‌‌‌‌ అవుతున్నామని డబ్ల్యూఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ సీఈఓ కేశవ్‌‌‌‌ మురుగేష్‌‌‌‌ అన్నారు. ‘హబ్‌‌‌‌ అంటే ఆఫీస్‌‌‌‌లలో చేసే వర్క్‌‌‌‌, ఎడ్జ్‌‌‌‌ అంటే ఇంటి నుంచి చేసే వర్క్, స్పోక్ అంటే టైర్‌‌‌‌‌‌‌‌ 2,3 సిటీల నుంచి చేసే వర్క్‌‌‌‌’ అని వివరించారు. గతంలో జాబ్స్‌‌‌‌ కోసం ప్రజలు మెట్రో సిటీలకు వచ్చేవారని, కానీ రెగ్యులేషన్స్‌‌‌‌లలో మార్పుల వలన వారెక్కడున్నన్నా జాబ్స్‌‌‌‌ వెతుక్కుంటూ వెళతాయని మురుగేష్‌ చెప్పారు.

ఫుల్‌‌‌‌ టైమ్‌‌‌‌ వర్కర్లు, గిగ్‌‌‌‌ వర్కర్లతో కలిపి టైర్‌‌‌‌‌‌‌‌ 2,3 సిటీలలోని టాలెంట్‌‌‌‌ను వాడుకుంటే అడ్వాంటేజ్‌‌‌‌ ఎక్కువని అన్నారు. కొత్త రెగ్యులేషన్స్ వలన రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఐటీ పాలసీలను అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయాల్సి ఉంటుందని చెప్పిన మురుగేష్​,  టెక్నాలజీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేయడం, సైబర్  సేఫ్టీ, ఉద్యోగ కల్పన, కొత్తగా సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లెన్స్‌‌‌‌లను ఏర్పాటు చేయడం, టాలెంట్‌‌‌‌ హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌ను నెలకొల్పడం వంటివి ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.