ఏంటీ ఘోరం : ఐటీ ఆఫీసు పార్కింగ్ లోనే.. మహిళా కొలీగ్ ను కొట్టి చంపిన మగ ఉద్యోగి

మహిళా ఉద్యోగినిపై దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన పూణేలో వెలుగు చూసింది. పూర్తివివరాల్లోకి స్థానిక పట్టణంలోని బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ కంపెనీలో శుభదా శంకర్ కోడరే (28), కృష్ణ సత్యనారాయణ కనోజా (30) ఇద్దరు వ్యక్తులు పని నచ్చేస్తున్నారు.  కృష్ణ సత్యనారాయణ తన నాకుటుంబ సభ్యులతో కలసి శివాజీనగర్‌ లో నివాసం ఉంటున్నాడు. శుభదా శంకర్ కూడా దగ్గర్లో ఉన్న హాస్టల్ లో ఉంటోంది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. 

శుభద శంకర్ తన తండ్రి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో శుభద ఉద్యోగం చేయగా వచ్చే డబ్బుతో తన తండ్రికి చికిత్స చేయిస్తోంది. అయినప్పటికీ ట్రీట్మెంట్ కి డబ్బు సరిపోకపోవడంతో తన స్నేహితుడు కృష్ణ సత్యనారాయణ నుంచి దాదాపుగా రూ.4లక్షలు అప్పుగా తీసుకుంది. కానీ ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటివాటి కారణంగా అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమైంది. తీసుకున్న డబ్బు ఎన్ని రోజులు గడిచినా తిరిగి చెల్లించకపోవడంతో కృష్ణ సత్యనారాయణకి సహనం నశించింది. 

ALSO READ | HYD: జీడిమెట్లలో ర్యాపిడో డ్రైవర్ది హత్యా? ఆత్మహత్యనా?

దీంతో ఎరవాడలోని BPO సంస్థ అయిన WNS గ్లోబల్ సర్వీసెస్ పార్కింగ్ స్ధలంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న శుభదా శంకర్ పై కృష్ణ సత్యనారాయణ దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చాలామంది ఉన్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా కృష్ణ సత్యనారాయణ ని అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత భాదితురాల్ని చికిత్స కోసం దగ్గర్లోని నగర్‌ రోడ్డులోని సహ్యాద్రి ఆసుపత్రికి తరలించారు. కానీ అపప్టికే తీవ్ర రక్త స్త్రావం జరగడంతో శుభదా శంకర్ మృతి  చెందింది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి  నిందితుడు కృష్ణ సత్యనారాయణపై  సెక్షన్ 103 (1) 4, 5 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏదైనప్పటికీ ఆర్థిక లావాదేవీల కారణంగా నిండు ప్రాణం బలైపోయిందని శుభద శంకర్ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.