Aha OTT Movie: ఆహా ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Aha OTT Movie: ఆహా ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆయన తనయుడు హీరో రాజా గౌతమ్ కలసి నటించిన లేటెస్ట్ మూవీ "బ్రహ్మా అనందం". గత నెల (ఫిబ్రవరి 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. 

యంగ్ డైరెక్టర్ ఆర్వీయస్ నిఖిల్ దర్శకత్వం వహించిన బ్రహ్మా అనందం మూవీ హోళీ స్పెషల్గా ప్రీమియర్కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్కి రానున్నట్లు సమాచారం. అయితే, స్ట్రీమింగ్ డేట్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే, ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ అందుకోలేదు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్గా హిట్ అందుకోలేదు. దాంతో ఈ సినిమా నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్కి వస్తోంది. ప్రేమ‌కు వ‌య‌సుతో సంబంధం ఉండ‌ద‌నే పాయింట్‌కు తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధాన్ని జోడిస్తూ డైరెక్ట‌ర్ ఆర్‌వీఎస్ నిఖిల్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్ల మధ్య రిలేషన్ చక్కగా పని చేసింది. ఫస్టాఫ్లో రాజా గౌతమ్ కష్టాలు, బ్రహ్మానందం సెంటిమెంట్ డైలాగులు, మరోపక్క కామెడీ ఇలా అన్ని చక్కాగా కుదిరాయి. పల్లెటూరులో సిటీ కుర్రాడు గౌతమ్ పడే కష్టాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే బ్ర‌హ్మానందం, వెన్నెల‌కిషోర్ పోటీప‌డి వేసే పంచ్‌లు న‌వ్విస్తాయి.

ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.  రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ మూవీకి శాండిల్య  పీసపాటి సంగీతం అందించాడు.

కథేంటంటే:

బ్రహ్మానందం(హీరో గౌతమ్) చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి అనాథగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. దీంతో చుట్టుప్రక్కల వాళ్ళని పట్టించుకోకుండా  సెల్ఫిష్ గా ఉంటాడు. అయితే బ్రహ్మానందం కి థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దీంతో అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటాడు.

ఈ క్రమంలో ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న రామ్మూర్తి (బ్రహ్మానందం)ని అనుకోకండా కలుస్తాడు. దీంతో 10 రోజులపాటూ తనతో తన విలేజ్ కి వచ్చి మనవడిగా నటిస్తే డబ్బులిస్తానని తనతోపాటు తన ఊరికి తీసుకెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి బ్రహ్మానందం అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..