
సినిమా పేరు: బ్రహ్మా ఆనందం (Brahma Anandam Movie Review)
విడుదల తేదీ: 2025-02-14
తారాగణం: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్
దర్శకుడు: RVS నిఖిల్
సంగీతం: శాండిల్య పిసపాటి
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్.
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆయన తనయుడు హీరో రాజా గౌతమ్ కలసి నటించిన "బ్రహ్మా అనందం" సినిమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ ఆర్వీయస్ నిఖిల్ దర్శకత్వం వహించగా రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ ఏమిటంటే..?
బ్రహ్మానందం(హీరో గౌతమ్) చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి అనాథగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. దీంతో చుట్టుప్రక్కల వాళ్ళని పట్టించుకోకుండా సెల్ఫిష్ గా ఉంటాడు. అయితే బ్రహ్మానందం కి థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దీంతో అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలో ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న రామ్మూర్తి (బ్రహ్మానందం)ని అనుకోకండా కలుస్తాడు. దీంతో 10 రోజులపాటూ తనతో తన విలేజ్ కి వచ్చి మనవడిగా నటిస్తే డబ్బులిస్తానని తనతోపాటు తన ఊరికి తీసుకెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి బ్రహ్మానందం అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
బ్రహ్మానందం ఎక్స్పీరియన్స్, హీరో రాజా గౌతమ్ టాలెంట్ ఈ సినిమాకి అద్భుతంగా పని చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్ ల మధ్య రిలేషన్ చక్కగా పని చేసింది. ఫస్టాఫ్ లో రాజా గౌతమ్ కష్టాలు, బ్రహ్మానందం సెంటిమెంట్ డైలాగులు, మరోపక్క కామెడీ ఇలా అన్ని చక్కాగా కుదిరాయి. పల్లెటూరులో సిటీ కుర్రాడు గౌతమ్ పడే కష్టాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ అసక్తని పెంచాయి.
ఇక సెకెండాఫ్ లో కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో ల్యాగ్ ఉండటంతో బోర్ కొడుతుంది. కానీ బ్రమ్మి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా వర్కవుట్ అవ్వడంతో మంచి ఫన్ ఉంటుంది. అయితే అప్పటివరకూ సెల్ఫీష్ గా ఉన్న గౌతమ్ ఒక్కసారిగా మారిపోతాడు. దీంతో సెంటిమెంట్ సన్నివేశాలు బాగానే అలరించాయి. అయితే అప్పటివరకూ కామెడీ, ఎమోషన్స్ తో సాగుతున్న సినిమా క్లైమాక్స్ లో అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. డైరెక్టర్ క్లైమాక్స్ ని ఎమోషన్స్ తో వర్కవుట్ చెయ్యాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. కానీ ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాకి డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. అలాగే కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేస్తూ చేసిన స్టోరీ ప్రజెంటేషన్ దాదాపుగా బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా రియల్ లైఫ్ లో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం – రాజా గౌతమ్ ని తాత మనవళ్ళుగా ఎంచుకున్నప్పుడే డైరెక్టర్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రమ్మి కామెడీ టైమింగ్ అద్భుతంగా పని చేసింది. హీరో రాజా గౌతమ్ కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా యాక్టింగ్ అదరగొట్టాడు.
హీరోయిన్స్ గా నటించిన ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ లు ఫర్వాలేదనిపించినప్పటికీ హైప్ ఇచ్చే సీన్స్ లేవు. ఆలాగే మెయిన్ ప్లాట్ మొత్త తాత మనవళ్ల మధ్యనే ఎక్కువగా ఉండటంతో డైరెక్టర్ వీరిని సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పవచ్చు. ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య పిసపాటి సంగీతం అందించాడు. ఇందులో పాటలు పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ సన్నివేశాలకి తగ్గట్టుగా బీజియం మాత్రం చక్కగా సింక్ చేశాడు. ఎడిటింగ్ విభాగంలో సెకెండాఫ్ లోని కొన్ని సీన్స్ లో కత్తెర పెట్టి ఉంటే ల్యాగ్ తగ్గి బోర్ కొట్టకుండా ఉండేది. కానీ ఓవరాల్ గా చూస్తే టెక్నీకల్ టీమ్ పనితీరు కూడా చక్కగా ఉందని చెప్పవచ్చు.
ఐతే మంచి ఫ్యామిలీ, ఎమోషన్స్ ని ఎంజాయ్ చెయ్యాలని అనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. అలాగే చాలా రోజుల నుంచి బ్రమ్మి ఫుల్ లెంగ్త్ కామెడీని మిస్ అయిన ఫ్యాన్స్ కి మంచి ఫుల్ మీల్ ఫీస్ట్ అని చెప్పవచ్చు.