బ్రహ్మకుమారీస్ హెడ్ దాది రతన్ మోహినిజీ మృతికి సీఎం సంతాపం

బ్రహ్మకుమారీస్ హెడ్ దాది రతన్ మోహినిజీ మృతికి సీఎం సంతాపం

జైపూర్: బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్‎గా సేవలందించిన రాజయోగిని దాది రతన్ మోహినిజీ మంగళవారం కన్నుమూశారు. 101 ఏండ్ల వయసులో అహ్మదాబాద్‎లోని ఒక ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగ్డే, సీఎం భజన్ లాల్ శర్మ ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీలు కూడా ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘దాది రతన్ మోహనిజీ 2025, ఏప్రిల్ 8న మనల్ని విడిచి వెళ్లారు.101 ఏండ్ల వయసులో కన్నుమూశారు”అని పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలు ఏప్రిల్ 10న జరుగుతాయని వెల్లడించారు.