BrahmaAnandam Trailer: తాత ల్యాండ్ కోసం మనవడి తిప్పలు.. చివరికి ఏమైంది..?

BrahmaAnandam Trailer: తాత ల్యాండ్ కోసం మనవడి తిప్పలు.. చివరికి ఏమైంది..?

టాలీవుడ్ ప్రముఖ హీరో గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, గౌతం తాత మనవళ్లుగా నటిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రముఖ డైరెక్టర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా యంగ్ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. నూతన మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య పిసపాటి సంగీతం అందించాడు. అయితే గత రెండుమూడేళ్లుగా బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ కామెడీ సన్నివేశాల్లో నటించడం లేదు. దీనికితోడు ఈ మధ్య నటించిన సినిమాల్లో బ్రమ్మి ఎక్కువగా ఏమోషనల్ పాత్రలే చేశాడు. దీంతో కామెడీ ని మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. దీంతో ఫుల్ లెంగ్త్ కామెడీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. 

ALSO READ | #Single Glimpse: నాకు పెళ్లి కాకపోవడానికి ఆ నాకొడుకే కారణమంటున్న వెన్నెల కిషోర్.. ఏమైంది..?

సోమవారం "బ్రహ్మా ఆనందం" ట్రైలర్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో హీరో గౌతమ్ చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి అనాథగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. దీంతో చుట్టుప్రక్కల వాళ్ళని పట్టించుకోకుండా  సెల్ఫిష్ గా ఉంటాడు. అయితే గౌతమ్ కి థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దీంతో అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ డబ్బు కావాల్సి ఉండటంతో అనుకోకండా బ్రహ్మానందంని కలుస్తాడు. దీంతో 10 రోజులపాటూ తనతో తన విలేజ్ కి వచ్చి మనవడిగా నటిస్తే డబ్బులిస్తానని తనతోపాటు తన ఊరికి తీసుకెళతాడు. 

అయితే అప్పటివరకూ సెల్ఫిష్ గా బ్రతికిన గౌతమ్ కి పల్లెటూర్లో జనం, ఆప్యాయతలతో వుక్కిరిబిక్కరి అవుతుంటాడు. ఆ తర్వాత ఏమైంది..? అనే సస్పెన్స్ తో ట్రైలర్ కట్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్, ఎండింగ్ లోని ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. బీజియం, ప్రొడక్షన్ వాల్యూస్, డైలాగులు ఫర్వాలేదనిపించాయి. ఎమోషన్స్ & ఫ్యామిలీ బ్యాక్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 'బ్రహ్మా ఆనందం’ సినిమా వాలైంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రియల్ లైఫ్ లోని ఈ తండ్రీకొడుకులు రీల్ లైఫ్ లో తాత మనవళ్ళుగా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా హీరో గౌతమ్ కి మంచి కటౌట్ తోపాటు టాలెంట్ ఉంది. దీంతో కెరీర్ ఆరంభంలో పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హిట్ కొట్టి ఎంట్రీ ఇచ్చాడు.  కానీ క్రమక్రమంగా స్క్రిప్ట్స్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో సరైన హిట్ పడలేదు. కానీ  ఆ తర్వాత నటించిన సినిమాలు అన్నీ దాదాపుగా ప్లాప్ అయ్యాయి. మరి బ్రహ్మా ఆనందం మూవీతో గౌతమ్ కెరీర్ మలుపు తిరుగుతుందో చూడాలి.