అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన బ్రహ్మాజీ.. ఆ రాజకీయ నాయకులని అరెస్ట్ చేశారా..?

అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన బ్రహ్మాజీ.. ఆ రాజకీయ నాయకులని అరెస్ట్ చేశారా..?

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కావాలనే కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా సంబంధం లేనటువంటి కేసులలో ఇరికిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులోభాగంగా "దేశంలో ఇపప్టివరకూ ర్యాలీలు, సభలు జరిగినప్పుడు తొక్కిసలాటలు జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోయారని, వారందరినీ అరెస్ట్ చేశారా అని ప్రశ్నించాడు. ఒకవేళ ఇలా చేస్తే దేశంలో సగమంది రాజకీయ నాయకులు జైళ్లలో ఉంటారని పేర్కొన్నాడు.  బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కి నెటిజన్లు మద్దతు తెలుపుతన్నారు. దీంతో తన వ్యాఖ్యలతో ఏకీభవించి సపోర్ట్ చేసిన వారికి బ్రహ్మాజీ థాంక్స్ తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా బ్రహ్మాజీ ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేగాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1075 కోట్లు (గ్రాస్)  కలెక్ట్ చేసింది.