టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన వీళ్లు..ఇందులో తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో మసూద, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. సరదా సన్నివేశాలతో సాగిన టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది. గౌతమ్, వెన్నెల కిశోర్ తమదైన కామెడీతో నవ్వించారు. టీజర్ చివర్లో బ్రహ్మానందం ఎంట్రీతో వచ్చిన కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ అదిరిపోయాయి.
ALSO READ | జనాలు లేకపోవటంతో గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ తగ్గిస్తున్నారట..
ఇందులో సంప్రదాయ పంచె కట్టులో, చిరునవ్వుతో బ్రహ్మానందం కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నాడు.