కన్నప్ప చిత్రంలోని పిలక-గిలక అప్డేట్

కన్నప్ప చిత్రంలోని పిలక-గిలక అప్డేట్

ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్(బాలీవుడ్), శరత్ కుమార్, మోహన్ లాల్(మళయాళం), బ్రహ్మానందం, శివరాజ్ కుమార్(కన్నడ), సప్తగిరి, నయనతార తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మంచు విష్ణు దాదాపుగా రూ.250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. 

అయితే తాజాగా కన్నప్ప చిత్రంలో ప్రముఖ హాస్య నటులైన బ్రహ్మానందం మరియు సప్తగిరి పాత్రల పోస్టర్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ పోస్టర్ లో బ్రహ్మానందం మరియు సప్తగిరి పిలక, గిలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. అంతేగాకుండా వీరిద్దరూ చెట్టు చాటున దాక్కుని ఉన్నట్లు కనిపిస్తారు. 

ALSO READ | ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..

అలాగే ఈ పోస్టర్ లో "చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట... నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..." అనే డైలాగ్ ని కూడా రివీల్ చేశారు. దీంతో మళ్ళీ బ్రహ్మానందం సప్తగిరి వింటేజ్ కామెడీ ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ తదితర భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప చిత్రం దాదాపుగా 60శాతం షూటింగ్ పూర్తే చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఏ చిత్రాన్ని విడుదల చెయ్యబోతుననట్లు సమాచారం.