బ్రహ్మానందం ఆస్తులు రూ.500 కోట్లు..! ఇండియాలోనే ధనవంతుడైన కమెడియన్

బ్రహ్మానందం(Brahmanandam).. ఈ పేరుకు కొత్త పరిచయం అవసరంలేదు. తన కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన లెజెండరీ కామెడియన్. నటిస్తే కాదు.. ఆయన కనిపిస్తేనే నవ్వేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆయన చాలా మందికి ఒక గొప్ప కమెడియన్ గా మాత్రమే తెలుసు కానీ.. ఇండియాలోనే అత్యంత  ధనవంతుడైన కమెడియన్ అని ఎంతమందికి తెలుసు? అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత రిచెస్ట్ కామెడియన్ గా బ్రహ్మానందం రికార్డ్ క్రియేట్ చేశారు. 35ఏళ్ల ఆయన సినీ కెరీర్ లో దాదాపు 1000 పైగా సినిమాల్లో న‌టించి.. నేటికీ కామెడీ రారాజుగా కొన‌సాగుతున్నారు బ్రహ్మానందం.

ఒక కామెడియన్ స్టార్ హీరో రేంజులో సంపాదించ‌గ‌ల‌రా? అనే ప్రశ్నకు సమాధానం ఆయన. నిన్నమొన్నటివరకు.. బాలీవుడ్ కమెడియన్  కపిల్ శర్మ(Kapil sharma), భారతీ సింగ్(Bharathi singh) భారతదేశపు అత్యంత సంపన్న హాస్యనటులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రినీ దాటేసి మొదటి స్థానంలో నిలిచారు బ్రహ్మానందం. ఆయన నెలవారీ సంపాదన రూ. 2 కోట్ల కంటే ఎక్కువ. కేవలం సినిమాల వల్లే కాదు.. బ్రాండ్ అండార్స్మెంట్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు బ్రహ్మి. ఈయన ఒక్కో ఎండార్స్మెంట్ కోసం కోటి నుండి రెండు కోట్ల వరకు తీసుకుంటున్నారట. దీంతో..  ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తుల‌ విలువ సుమారు రూ. 490 కోట్లకు చేరుకుందని సమాచారం. 

అంతేకాదు.. జీవించి ఉన్న న‌టుల్లో అత్యధిక సినిమాల్లో న‌టించిన న‌టుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ కూడా క్రియేట్ చేశారు బ్రహ్మానందం. ఇందులో భాగంగా సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2029లో పద్మశ్రీ అందుకున్నారు. ఒక మాములు  కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ మొదలుపెట్టిన బ్ర‌హ్మానందం... ఇప్పుడు భారతదేశపు అత్యంత ధనవంతుడైన కమెడియన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు.