
తొర్రూరు, వెలుగు: బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.100 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్ లో మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. తొర్రూరు వాసి, బోప్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ నాయకత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను కలిసి బొకే అందజేసి, శాలువాతో సన్మానించారు.
అనంతరం బోప్వా రాష్ట్ర అధ్యక్షులు బీవీ సుశీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.100 కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంప్రసాద్, పివి రామచంద్రరావు, సీతారామయ్య, రాంబాబు, శ్రీనివాస శర్మ, సంతోష్ కుమార్ శాస్త్రి, అలహరి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.