- బ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం
- పాత మిసైల్స్ స్థానంలో వీటిని ఇన్స్టాల్ చేస్తాం: హరికుమార్
- దేశీయంగా డెవలప్ చేస్తున్నామని ఇండియన్ నేవీ చీఫ్ వెల్లడి
పుణె: బ్రహ్మోస్ మిసైల్ ఇకపై ఇండియా ప్రధాన ఆయుధమని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ స్పష్టంచేశారు. ఇతర దేశాల నుంచి సేకరించిన మిసైల్ సిస్టమ్ ప్లేస్‌లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉపయోగిస్తామని తెలిపారు. పాత మిసైల్స్ స్థానంలో వీటిని ఇన్స్టాల్ చేస్తున్నామని చెప్పారు. ఇన్స్టాలేషన్ నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. మార్చి 5న 200కు పైగా క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన రూ.19 వేల కోట్ల డీల్‌కు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వనుంది. ఈ క్రమంలో హరికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
సోమవారం పుణెలో నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పో ముగింపు వేడుకల్లో హరికుమార్ మాట్లాడారు. ‘‘ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ మిసైల్.. ఇప్పుడు వైమానిక దళం, యుద్ధ విమానాల్లో ప్రధాన ఆయుధం కానుంది. ఈ మిసైల్ సామర్థ్యాలు, పరిధిని మెరుగుపర్చాం. బ్రహ్మోస్ మిసైల్ ఎంతో శక్తివంతమైంది. దేశీయంగా ఈ క్షిపణిని ఎంతో డెవలప్ చేశాం. మేడ్ ఇన్ ఇండియా వెపన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని తెలిపారు. బ్రహ్మోస్ మిసైల్ దేశంలోనే తయారవుతోందని, విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు.