ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ మరోసారి సత్తా చాటింది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఒడిశా చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) మూడో లాంచ్ కాంప్లెక్స్ నుంచి బ్రహ్మోస్ మిసైల్ ట్రయల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. టెస్ట్ లో నిర్దేశించిన అన్ని పారామీటర్స్ ను ఈ మిసైల్ పూర్తి చేసినట్లు తెలిపింది. బ్రహ్మోస్.. మీడియం రేంజ్ రాంజెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది 300 కిలోల వార్ హెడ్లను మోసుకుని, గరిష్టంగా మ్యాక్ 3 (ధ్వనివేగానికి మూడు రెట్లు ఎక్కువ వేగం) వేగంతో అంటే.. గంటకు 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. మీడియం రేంజ్ వెర్షన్ క్షిపణి 450 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ధ్వంసం చేయగలదు. నేలపై మొబైల్ లాంచర్ వెహికిల్స్ నుంచి, గగనతలంలో యుద్ధవిమానాల నుంచి, సముద్రంలో సబ్ మెరైన్లు, యుద్ధనౌకల నుంచి.. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా దూసుకెళ్లి ఇది టార్గెట్లను నేలమట్టం చేయగలదు. దీనిని డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్ పీఓఎం సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేశాయి. ప్రస్తుతం ఈ మిసైల్ ను ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాడుతున్నాయి.
బ్రహ్మోస్.. మరోసారి సక్సెస్
- దేశం
- December 18, 2019
లేటెస్ట్
- విద్యార్థులకు ఫ్రీగా ప్రజాకవి కాళోజీ బయోపిక్ సినిమా
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- అన్ని వర్గాల రైతులకు ప్రాధాన్యమివ్వాలి
- తమన్నా బర్త్ డే స్పెషల్.. ఓదెల 2 నుంచి కొత్త పోస్టర్
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి మాకు రెఫరండమే
- శాతవాహన వర్సిటీ పీహెచ్ డీ నోటిఫికేషన్ రిలీజ్
- కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు
- అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్
- కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...