నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. రధసప్తమి రోజున కల్యాణం జరగడం ఇక్కడి విశేషం. ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పట్టు వస్రాలను, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలో పాల్గొన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి సీఎంను రేవంత్ రెడ్డిని గుట్టకు తీసుకువచ్చి చెరువుగట్టుకు రెండో ఘాటు రోడ్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. లక్షకు పైగా భక్తులు హాజరయ్యారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.- - నార్కట్ పల్లి , వెలుగు