- రేపు సీతారాముల కల్యాణం
జమ్మికుంట, వెలుగు: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 27వరకు జరగనున్నాయి. 17న సీతారాముల కల్యాణానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు బాహ్య మందిర ప్రవేశాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత భక్తులు స్వామివారి తలంబ్రాల బియ్యం కలిపారు. వేములవాడకు చెందిన రాజరాజేశ్వరీ దేవి సేవాసమితి ఆధ్వర్యంలోస్వామివారికి సారే చీర, గోటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు..
15న రాత్రి 7గంటలకు ఉత్సవమూర్తులను బాహ్యమందిర ప్రవేశం ఉంటుంది. 16 న శ్రీ విశ్వకేశనారధన, పుణ్యవచనం, రక్షా బంధనం అంకురార్పణ,17న ఎదుర్కోళ్లతో మధ్యాహ్నం 12గంటలకు శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించి, రాత్రి ఉత్సవమూర్తులను శేషా వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు-.18న శ్రీరాముని మహాపట్టాభిషేకం, 108 సువర్ణ పుష్పార్చన.. తదితరల కార్యక్రమాలు 27వరకు కొనసాగుతాయని ఈవో కందుల సుధాకర్ తెలిపారు. సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున కలెక్టర్ పమేలాసత్పతి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.