నవంబర్ 24 నుంచి బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్​ టెంపుల్​లో బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు : బంజారాహిల్స్ లోని హరేకృష్ణ గోల్డెన్​టెంపుల్​లో ఈ నెల 24 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు హరేకృష్ణ మూవ్​మెంట్ అధ్యక్షుడు శ్రీసత్యగౌరచంద్ర దాసప్రభు తెలిపారు. శుక్రవారం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవతల ప్రతిష్ఠాపన వేడుకలను యేటా బ్రహ్మోత్సవాలుగా జరుపుకోవడం ఆచారంగా వస్తోందని, ఉత్సవాల్లో భాగంగా రాధాగోవింద మూల విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు.