బంజారాహిల్స్ లో ఘనంగా ముగిసిన గోల్డెన్​ టెంపుల్​ వార్షిక బ్రహ్మోత్సవాలు

 

  • కనుల పండువగా చక్ర స్నానం

హైదరాబాద్​సిటీ, వెలుగు: బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్​టెంపుల్​లో ఆరు రోజులపాటు వైభవంగా కొనసాగిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మహా పూర్ణాహుతి, ఉత్సవ అభిషేకం, చక్రస్నానం, పుష్పయాగంతోపాటు భజనలు, సంకీర్తనల మధ్య శ్రీరాధాగోవింద లక్ష్మీనర్సింహస్వామి, శ్రీనితాయ్​గౌరాంగ, శ్రీల ప్రభుపాదుల వారికి 108 కలశాలతో మహాచూర్ణాభిషేకం చేశారు. మహాసంప్రోక్షణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో వేడుకలు ముగిశాయి. ఇస్కాన్​బెంగళూరు, అక్షయపాత్ర ఫౌండేషన్​చైర్మన్​మధుపండిత దాస ప్రభుజీ, హరేకృష్ణ మూవ్​మెంట్ హైదరాబాద్​ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.