![మన్యంకొండలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు](https://static.v6velugu.com/uploads/2025/02/brahmotsavams-begin-at-manyamkonda-sri-lakshmi-venkateswara-swamy-temple_Rv6ntExmPO.jpg)
- తిరుచ్చి సేవలో వెంకన్న స్వామి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం తిరుచ్చి సేవ నిర్వహించారు. స్వామి ఉత్సవ విగ్రహాలను కోటకదర గ్రామంలోని అలహరి వంశస్తుల నివాసం నుంచి మన్యంకొండ దేవస్థానానికి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల నృత్యాల నడుమ స్వామి వారిని తోడ్కొని వచ్చారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వంశపార్యంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో గోవిందరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు.