ఫిబ్రవరి 11 నుంచి వేణుగోపాలస్వామి ఉత్సవాలు

ఫిబ్రవరి 11 నుంచి వేణుగోపాలస్వామి ఉత్సవాలు

నార్కట్​పల్లి, వెలుగు : నార్కట్​పల్లి మండల పరిధిలోని గోపలయపల్లి గ్రామ సమీపంలో గల శ్రీవారుజాల వేణుగోపాలస్వామి ఆలయంలో నేటి నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. విష్ణుసహస్ర నామం స్వచ్ఛ పారాయణం, అధ్యయనోత్సవంతో సోమవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

11న అంకురార్పణ, హోమం, ధ్వజరోహణ, గరుడముద్ద బలిహారుణం,12న శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, 13న గరుడ సేవ, బలిహరణ, హోమం,14న హనుమంతు సేవ, బలిహరణ, హోమం,15న గ్రామోత్సవం, రథోత్సవం,16న పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపోత్సవం,17న శతకలశాభిషేకం, శ్రీ పుష్పయాగం, ఏకాంత సేవ, పవళింపు సేవ అనంతరం బ్రహ్మోత్సవాలుముగుస్తాయి. 

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..

బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో అన్ని ఏర్పాటు పూర్తి చేశాం. ఉత్సవాలకు మండల ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి పౌర్ణమి రోజున మాస కల్యాణం, హోమం నిర్వహిస్తాం. ‌‌‌‌‌‌‌‌ - కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్