ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ – 2024గా బ్రెయిన్ రాట్ (Brain Rot)ను ప్రకటించింది. 37 వేల మందికిపైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి ఆరు పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ రాట్ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు. నిష్ప్రయోజనకరమైన కంటెంట్ వినియోగంపై విస్తృత ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బ్రెయిన్ రాట్ అనే పదాన్ని 2024 పదంగా ఎంపిక చేశారు.
బ్రెయిన్ రాట్ అంటే మానసిక లేదా మేధోస్థితి క్షీణించడం. అవసరం లేని కంటెంట్‌ను అధికంగా వినియోగించడం వల్ల ఇది కలుగుతుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తక్కువ నాణ్యత కలిగిన ఆన్లైన్ కంటెంట్‌తో ఎక్కువగా మమేకం అయినప్పుడు కలిగే దుష్ప్రభావాలపై ఏడాది కాలంగా ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
ఆంగ్ల రచయిత హెన్రీ డేవిడ్ 1854లో తాను రాసిన వాల్డెన్ అనే పుస్తకంలో ఈ పదాన్ని మొదట వినియోగించారు.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పదాల్లో డెమ్యూర్, డైనమిక్ ప్రైసింగ్, లోర్, రొమాంటసీ, స్లోప్ తదితర పదాలు బ్రెయిన్ రాట్‌తో పోటీపడగా చివరికి ఎక్కువ మంది బ్రెయిన్ రాట్కే ఓటు వేయడంతో వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.