మెదడు ఆరోగ్యానికి ‘బ్రెయిన్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌’

మెదడు ఆరోగ్యానికి ‘బ్రెయిన్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌’

హైదరాబాద్, వెలుగు: మెదడు  ఆరోగ్యాన్ని పెంచేందుకు  ‘బ్రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్’  డివైజ్‌‌‌‌‌‌‌‌ను  బ్రెయిన్ ట్యాప్ డెవలప్ చేసింది. దీనిని   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టీ హబ్‌‌‌‌‌‌‌‌లో కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌‌ నవాబ్‌‌ మీర్ నాసిర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రెయిన్ ట్యాప్ సీఈఓ పాట్రిక్ పోర్టర్, సీఎంఓ సింథియా పోర్టర్, బ్రెయిన్ ట్యాప్ బోర్డు డైరెక్టర్ విషాల్ బైజాల్, చీఫ్ సైన్స్ ఆఫీసర్ (బ్రెయిన్ ట్యాప్, యూఎస్)  ఫ్రాన్సిస్కో సిడ్రల్ తదితరులు పాల్గొన్నారు. మానసిక స్పష్టతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, సమగ్ర ఆరోగ్యానికి  బ్రెయిన్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాయపడుతుందని పాట్రిక్ పోర్టర్ పేర్కొన్నారు.