హైదరాబాద్, వెలుగు: పోర్సిలిన్ స్లాబ్స్ అమ్మే స్టోన్‌లామ్ సరికొత్త ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. ఇవి కేవలం 3 ఎంఎం మందం ఉంటాయి. హోటళ్లు, వాణిజ్య ప్రదేశాలు, ఇండ్లు, హోటల్స్ వంటి చోట్ల ఫసడ్స్ క్లాడింగ్, గోడల కోసం ఉపయోగిస్తారు. నీటిని, వేడిని, కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వీటిని తయారు చేశారు.
ఈ స్లాబ్స్‌ను ఇటలీ నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతున్నామని, 25 ఏళ్లపాటు మన్నుతాయని స్టోనెక్స్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ పాఠక్ చెప్పారు. తెలంగాణ ప్రాంతం దేశంలోనే స్టోన్‌లామ్‌కు అతిపెద్ద మార్కెట్‌గా అని చెప్పారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులకు తాము స్లాబ్స్‌ను సరఫరా చేశామని చెప్పారు.
తమ వ్యాపారంలో ఏపీ/తెలంగాణ ప్రాంతం నుంచి ఐదు శాతానికి పైగా వాటా ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 8-–10 శాతానికి చేరుకుంటుందని స్టోన్‌లామ్ సీఈఓ సందీప్ బగాడే వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వృద్ధి వల్ల తమ బ్రాండ్ టర్నోవర్ రూ. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో రూ.18–-20 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు.