ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు విజయవాడ(ఏపీ) అతలాకుతలమైన విషయం తెలిసిందే. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఆహారం, నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయారు. ఇక పసిపిల్లలున్న వారి సంగతి ఆ దేవునికే తెలియాలి. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అలానే ఉంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. వరద ఉద్ధృతి మాత్రం అలానే ఉంది. మంగళవారం వెయ్యి క్యూసెక్కులే ఉన్న వరద ప్రవాహం బుధవారం 8 వేల క్యూసెక్కులు దాటేసింది. దాంతో, వరద నీరు మరో అడుగు పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
నీటమునిగిన కొత్త కార్లు
ఇదిలావుంటే బెజవాడ చుట్టూ స్టాక్ యాడ్స్‌లో నిల్వ ఉంచిన పలు కంపెనీల కొత్త కార్లు నీట మునిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన పంచ్, నెక్సాన్ కార్లు నీట మునిగిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాటా స్టాక్‌యార్డులో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేసి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. నీట మునిగిన వాటిలో కస్టమర్లు సర్వీసింగ్ కోసమని ఇచ్చినవి కొన్ని ఉన్నాయని వెల్లడించారు. రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరూమ్ సిబ్బంది పేర్కొన్నారు.
ఈ ఒక్క కంపెనీ అనే కాదు.. హుందాయ్ కంపెనీల కార్ల గోదాంలు.. నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిల్వ ఉంచే ఫ్లిప్ కార్ట్ గోదాంలు వంటివి నీట మునిగాయి. దాదాపు నాలుగు రోజులు కావొస్తున్నా.. అక్కడి పరిస్థితులు మాత్రం అలానే ఉన్నాయి.
#AndhraPradesh. 300 brand new cars and some are under service. pic.twitter.com/grpGBA72Gt
— @Coreena Enet Suares (@CoreenaSuares2) September 3, 2024