తల్లి మరణించిన బాధలోనూ టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్ష రాసిన విద్యార్థి

తల్లి మరణించిన బాధలోనూ టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్ష రాసిన విద్యార్థి

శంకరపట్నం, వెలుగు: తల్లి అనారోగ్యంతో చనిపోగా.. పుట్టెడు దు:ఖంలోనూ ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాసింది. కరీంనగర్  జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన చీర్లవంచ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– ప్రియాంక కూతురు పౌర్ణమి సిరిసిల్లలోని ఓ సోషల్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్​స్కూల్‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. ప్రియాంక అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌‌‌‌‌‌‌‌లో చికిత్స తీసుకుంటోంది.

 ఈక్రమంలో ఆమె శనివారం తెల్లవారుజామున చనిపోయింది. తల్లి చనిపోయిన బాధలోనూ ఆమె టెన్త్‌‌‌‌‌‌‌‌ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం ఇంటికి చేరుకొని తల్లి మృతదేహంపై పడి రోధించింది. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.