ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం మంజూరైందని అధికారికంగా ప్రకటించింది. బ్రిక్స్‌కూటమిలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందేందుకు ఇండోనేషియా 2023లో బ్రిక్స్‌కు చేసిన ప్రతిపాదనకు కూటమిలోని సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి.
ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఇండోనేషియా జనాభాపరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ప్రస్తుతం బ్రిక్స్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందడంలో దక్షిణ అమెరికాలోని దేశాలతో ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, ప్రపంచ సుపరిపాలనలో సంస్కరణలకు దోహదపడుతుంది. బ్రిక్స్ కూటమి
బ్రిక్స్ కూటమిని 2009లో భారత్, చైనా, బ్రెజిల్, రష్యాలు కలసి ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా, 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈలు చేరాయి. సౌదీ అరేబియా కూడా బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉంది. బ్రిక్స్‌లో తమను కూడా చేర్చుకోవాలంటూ టర్కీ, అజర్ బైజాన్, మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తుల సమర్పించాయి.