ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం..

ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం..

 బ్రెజిల్ లో ఘోర విషాదం జరిగింది. 62 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఘటనలో ఫ్లైట్ లోని  వారంతా చనిపోయారు. సావా పువాలోలోని నివాసప్రాంతమైన విన్ హెడోలో ఈ ప్రమాదం జరిగింది. విమానం సావో పువాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

స్పాట్ కు చేరుకున్న  పోలీసులు, సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు  చేపట్టాయి. ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. ప్రమాదంపై అధ్యక్షుడు లుయూజ్  లలూ డసిల్వా  విచారం వ్యక్తం చేశారు. విమానం కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.