ప్రపంచంలోని ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచే దేశాల్లో ఫ్రాన్స్, బ్రెజిల్ ఎప్పుడూ ముందుంటాయి. ఆయా దేశాల్లోని మోడళ్ల నుంచి నేటి తరం అమ్మాయిలు అందరూ అందం, డైట్, బ్యూటీ టిప్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో.. బ్రెజిల్ కు చెందిన 29 ఏళ్ల లూనా ఆండ్రిడ్ అనే సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ తీవ్ర గుండెపోటుతో చనిపోయారు.
బ్రెజిల్ లో పావులర్ షో అయిన పవర్ కపుల్ ద్వారా ఎంతో గుర్తింపు పొందటంతోపాటు మంచి ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా నిత్యం వార్తల్లో ఉంటారు లూనా.. ఇటీవలే ఆమె మరింత అందం కోసం సర్జరీ చేయించుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఎప్పటిలాగే తన పనుల్లో బిజీ అయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే.. లూనాకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించింది. కార్డియాక్ అరెస్ట్ అని వెల్లడించారు డాక్టర్లు.
దీంతో బ్రెజిల్ యువత షాక్ అయ్యింది. ముఖ్యంగా లూనా బాయ్ ఫ్రెండ్ హెడెడ్ అయితే కన్నీటి పర్యంతం అయ్యాడు. అతను ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. 29 ఏళ్లకే పాపులర్ ఇన్ఫులెన్సర్ గా గుర్తింపు పొందిన లూనా మృతికి కారణం.. కాస్మొటిక్ సర్జరీ అని అంటున్నారు స్నేహితులు. ఇంత చిన్న వయస్సులో కార్డియాక్ అరెస్ట్ అనేది అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది. అప్పటి నుంచి నిక్షేపంగా ఉంటున్న మనుషులు.. కళ్ల ముందే కుప్పుకూలి చనిపోవటాన్ని ఊహించలేకపోతున్నారు జనం...