పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంక్‌లో సంతకం

కదలికలేని పరిస్థితిలో ఓ వ్యక్తిని మహిళ బ్యాంక్ కు తీసుకొచ్చి సంతకం పెట్టించడానికి ప్రయత్రించింది. బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని పరిశీలించగా ఇదివరకే అతను చనిపోయి ఉన్నాడు. ఇదంతా అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. కొన్ని గంటల ముందే పాలో రాబర్టో బ్రాగా(68) మరణించినట్లు రామెడిక్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. 

ఆయన మేనకోడలు ఎరికా డి సౌజా వియెరా నూన్స్‌, పాలో రాబర్టో పేరు మీద ఉన్న పెన్షన్ క్లైమ్ చేసుకోవడానికి ఆయన ఇంకా బతికే ఉన్నట్లు వీల్ ఛైర్ పై బ్యాంక్ కు  తీసుకొచ్చి పెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నించింది. బ్యాంక్ పేపర్స్ పై సంతకం పెట్టించడానికి ట్రై చేసింది. అనారోగ్యంతో ఉన్న పాలో రాబర్టో ను ఆయన మేనకోడలు ఎరికా డి సౌజా వియెరా నూన్స్‌ చూసుకుంటుంది. ఆమె చనిపోయిన పాలో రాబర్టో పేరు మీద లోన్ కు అప్లై చేసింది. ఆ లోన్ పేపర్స్ పై సంతకం పెట్టించడానికి తన మేన మామను వీల్ చైర్ పై బ్యాంక్ కు తీసుకొచ్చింది. అనుమానం వచ్చిన బ్యాంక్ సిబ్బంది  పాలో రాబర్టోని చెక్ చేయగా ఆల్ రెడీ ఆయన చనిపోయి ఉన్నాడు.