నల్గొండ, వెలుగు: ఆంధ్రా, ఒడిశా బార్డర్లో నల్గొండ జిల్లా పోలీసులు తలపెట్టిన గంజాయి ఆపరేషన్‌కు బ్రేక్ పడింది. ఈ నెల 14న నల్గొండ నుంచి వైజాగ్ వెళ్లిన నల్గొండ స్పెషల్ పోలీస్ టీమ్స్ మూడు రోజులు పాటు ఏఓబీలో గంజాయి స్థావరాలపై మెరుపుదాడులు చేశాయి. గంజాయి స్థావరాలపైన పోలీసులు దాడులు చేస్తున్నారన్న సమాచారంతో అలర్ట్అయిన స్మగ్లర్లు చాలామంది పారిపోయారు. ఆదివారం సాయంత్రం కొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఏజెన్సీ ఏరియా కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలికంగా ఆపరేషన్ నిలిపేస్తున్నట్లు పోలీసు ఆఫీసర్లు చెప్పారు. వైజాగ్‌నుంచి ప్రత్యేక టీమ్స్అన్నీ సోమవారం సాయంత్రం నల్గొండకు చేరుకున్నాయి. ఇప్పటికైతే పోలీసుల అదుపులో 20 మంది స్మగ్లర్లు ఉన్నట్లు తెలిసింది. వీరందరిని విచారించాక స్థావరాలకు సంబంధించి మరింత సమాచారం లభిస్తే వైజాగ్పోలీసుల సపోర్ట్‌తో తిరిగి దాడులు కొనసాగిస్తామని పోలీస్ఆఫీసర్లు చెప్పారు.