రాష్ట్ర హైడల్ పవర్ లో 90 శాతం ఒక్క శ్రీశైలం నుంచే
ఈ సీజన్ లో ఇప్పటిదాకా 800 ఎంయూల కరెంట్
ప్రమాదంతో ఈ సీజన్ మొత్తం ప్రొడక్షన్ ఉండకపోవచ్చంటున్న అధికారులు
వెయ్యి యూనిట్ల వరకు కరెంట్ లాస్ కావొచ్చని అంచనా
ఎన్ని రోజుల్లో పునరుద్ధరిస్తా రో చెప్పలేక అయోమయం
815 మెగావాట్ల కెపాసి టీ ఉన్న నాగార్జున సాగర్ నుంచి 0.2 ఎంయూలే
హైదరాబాద్ , వెలుగు: అగ్నిప్రమాదంతో శ్రీశైలం హైడల్ పవర్ ప్రొడక్షన్‌కు బ్రేక్ పడింది. ఆరో యూనిట్ ప్యా నెల్ బోర్డు వద్ద జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రమై నాలుగు యూనిట్లపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నారు. ప్లాంట్ పూర్తిగా దెబ్బతినడం, దానిని ఎన్ని రోజుల్లో పునరుద్ధరిస్తారో అధికారులు చెప్పలేకపోతుండడంతో చాలా రోజుల పాటు కరెంట్ తయారీ ఉండకపోవచ్చంటున్నారు. ఈ సీజన్ మొత్తం జరగకపోవచ్చనీ చెబుతున్నారు. రాష్ట్ర హైడల్ పవర్లో 90 శాతం శ్రీశైలం నుంచే వస్తోంది. సగటున రోజూ 21.6 మిలియన్ యూనిట్ల (ఎంయూ) పవర్‌ను శ్రీశైలం ఎడమగట్టు కే ద్రంలో తయారు చేస్తారు. దాని ద్వారా రోజూ రూ.15 కోట్ల మేర జెన్కోకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉత్పత్తికి బ్రేక్ పడడంతో ఆ ఆదాయాన్ని కోల్పోయింది. 6 యూనిట్లున్న శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ కెపాసిటీ 900 మెగావాట్లు. ఏటా సీజన్లో నాలుగు నెలల పాటు కరెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎండాకాలంలో కరెంట్ సమస్యలొస్తే అత్యవసర పరిస్థితుల్లో రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా కరెంట్‌ను తయారు చేస్తారు. ఇక ఈ వానాకాలంలో హైడల్ పవర్ ద్వారా మొత్తం 868 మిలియన్ యూనిట్ల కరెంట్ తయారవగా.. అందులో శ్రీశైలం వాటానే 800 ఎంయూలు.
జనరేటర్లు పోతే ఇప్పట్లో కష్టమే
శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్‌లోని ఆరు యూనిట్లలో ఒక్కో యూనిట్‌కు పది ప్యా నెళ్లు ఉంటాయి. ప్రమాదం జరిగిన నాలుగు యూనిట్లలో ఎన్ని ప్యా నెళ్లు దెబ్బతిన్నాయన్నది ఇప్పటిదాకా స్పష్టంగా తెలియరాలేదు. ఒక్క ప్యా నెల్ కాలిపోతే రీస్టోర్ చేయడానికి 15 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. జనరేటర్లలో ప్రాబ్లమ్ ఉన్నా, స్టేటార్, రోటార్లు పోయినా చాలా రోజులు పడుతుందని అంటున్నారు. ఒకవేళ అవిగానీ కాలిపోతే పవర్ ప్రొడక్షన్ ఇప్పట్లో కష్టమేనని చెబుతున్నారు. ఈ సీజన్లో మొత్తం బ్రేక్ పడితే వెయ్యి మిలియన్ యూనిట్లు కోల్పోయినట్టే. రోజూ సగటున 20 ఎంయూల చొప్పున కరెంట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇప్పుడు బ్రేక్ పడడంతో నెల రోజులకు 600 మిలియన్ యూనిట్ల మేర లాస్ జరిగినట్టేనని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరో నెలకు రోజూ సగటున 15 ఎంయూల చొప్పున 450 ఎంయూలు కలిపి.. రెండు నెలల్లో వెయ్యి మిలియన్ యూనిట్ల కరెంట్‌ను లాస్ అయినట్టేనని అంటున్నారు.
2009లో మునిగిన పవర్ ప్లాంట్
2009లో వరదలు వచ్చి నప్పడు రెండు యూనిట్లు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో ఆ ఏడాది మొత్తం జల విద్యుత్ ప్రొడక్షన్ పూర్తిగా నిలిచిపోయిం ది. శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత రెండు సార్లు ప్రాజెక్టుకు భారీ వరదలు వచ్చాయి. 1999లో ఒకసారి, 2009లో మరోసారి వరదలు ముంచెత్తాయి. అయితే, ఎన్నడూ లేనంతగా 2009లో వరదలు తీవ్రస్థాయిలో పోటెత్తాయి. 20 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా, 13.6 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో డ్యామ్‌ను కట్టారు. కానీ, ఆ ఏడాది ఊహకు అందనంతలా ఒకేసారి 24.5 లక్షల క్యూ సెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులే అయితే.. దానికి మించి 894 అడుగుల మేర వరద నీరు చేరింది. కుడిగట్టు జల విద్యుత్ కేం ద్రం పూర్తిగా మునిగిపోగా.. ఎడమగట్టు కేం ద్రం కూలింగ్ ప్లాంట్ మునిగిపోయింది.
రాష్ట్రంలో 2,440 మెగావాట్ల కెపాసిటీ
రాష్ట్రంలో మొత్తం హైడల్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ 2,440 మెగావాట్లు. అయితే, ఎక్కువగా శ్రీశైలం నుంచే కరెంట్ తయారవుతోంది. ఆరు యూనిట్ల నుంచి రోజుకు సగటున 20 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తవుతోంది. 815 మెగావాట్ల కెపాసిటీ ఉన్న నాగార్జునసాగర్ ప్ల ాంట్ నుంచి తయారవుతున్నది కేవలం 0.2 మిలియన్ యూనిట్లే. 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అప్పర్, లోయర్ జూరాల నుంచి 4 ఎంయూల చొప్పున కరెంట్‌ను తయారు చేస్తున్నారు. మిగతా కొంత పులిచింతల, పోచంపాడుల నుంచి తయారు చేస్తున్నారు.
శ్రీశైలం వాటా 90 శాతానికిపైనే
ఈ ఏడాది జూన్ 10 నుంచి శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో కరెంట్ తయారీ షురూ అయింది. అయితే అది రోజూ మిలియన్ యూనిట్ల లోపే ఉండేది. జులై 15 నుంచి రోజూ 6 మిలియన్ యూనిట్ల వరకు ప్రొడ్యూస్ చేశారు. అయితే, జులై 19 నుంచి నీటిని కిందికి వదులుతుండడంతో (పవర్ ప్రాజెక్ట్ ద్వారా) కరెంట్ ప్రొడక్షన్ జోరందుకుంది. జులై 20న ఒక్కసారిగా 27 ఎంయూలు, జులై 21న 28 ఎంయూలు, జులై 22న ఎక్కువగా 29 ఎంయూల కరెంట్ ను అధికారులు ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత రోజూ 25 నుంచి 29 ఎంయూల మధ్య ప్రొడక్షన్ జరుగుతోంది. మొత్తం గా ఈ సీజన్ లో రాష్ట్రం లో 868 ఎంయూల కరెంట్ తయారైతే.. ఒక్క శ్రీశైలం నుంచే 800 ఎంయూలు ఉత్పత్తయింది. అందులో శ్రీశైలం కరెంట్ వాటా 90 శాతానికిపైనే.
ఫస్ట్ టైం ప్రాణ నష్టం
శ్రీశైలం ప్లాంట్‌ను ప్రారంభించి నప్పటి నుంచి 20 ఏళ్లలో సిబ్బం ది చనిపోవడం ఇదే తొలిసారి. గతంలో భారీ వరదలు వచ్చినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజా అగ్ని ప్రమాదంలో తొలిసారి 9 మంది అందులో చిక్కు కుని చనిపోయారు. అందులో ఒక డీఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు ప్రైవేటు సిబ్బంది ఉన్నారు.
తయారీ ఖర్చు రూపాయి లోపే
శ్రీశైలం హైడల్ పవర్ తయారీకి ఖర్చు చాలా తక్కువ. ఒక్క యూనిట్ తయారీకి 70 పైసల వరకు ఖర్చవుతుందని జెన్కో వర్గా లు చెబుతున్నాయి. కరెంట్ సరఫరా కోసం ఒక్క యూనిట్‌కు రూ.6.84 నుంచి రూ.7.02 వరకు ట్రాన్స్‌కో ఖర్చు చేస్తోంది. ప్రొడక్షన్‌కు బ్రేక్ పడితే రోజూ రూ.15 కోట్ల వరకు నష్టం జరుగుతుంది.