
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ జడ్జి ఝలక్ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ఫెడరల్ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ బ్రేక్ వేశారు. ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి ఉద్యోగుల తొలగింపు అధికారాలు లేవని పేర్కొన్నారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.
ఉద్యోగుల లేఆఫ్స్‌పై ట్రంప్నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ లేబర్యూనియన్లు కోర్టును ఆశ్రయించాయి. పలు ప్రభుత్వ ఏజెన్సీల్లో ప్రొబేషనరీ సిబ్బంది అందరినీ పక్కనపెడుతున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని కోర్టు దృష్టికి తెచ్చాయి. విచారణ జరిపిన జడ్జి అల్సప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఏజెన్సీలే తమ విభాగాల్లో సిబ్బంది నియామకాలు, తొలగింపులు నిర్వహించుకునేలా కాంగ్రెస్ వాటికి అధికారం కల్పించిందని, కోతలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.