ఐ ఫోన్లపై పీచేముడ్
విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన బల్దియా
స్టాండింగ్ కమిటీకి గిఫ్ట్‌ల నిర్ణయం నిరవధిక వాయిదా
మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్‌తో స్పష్టత
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఐ ఫోన్ ఆశలకు బ్రేక్ పడింది. స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో బల్దియా వెనక్కి తగ్గింది. గురువారం ముసాయిదా బడ్జెట్ మీటింగ్‌లో భాగంగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మేయర్, డిప్యూటీ మేయర్, 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, మరో ముగ్గురికి ఐ ఫోన్ 12 ప్రో విత్ 512 జీబీ మోడల్ ఫోన్లను ఇవ్వాలని తీర్మానించారు. ఒక్కో ఫోన్ కి జీఎస్టీతో కలిపి లక్షా 60 వేలు కాగా, 20 ఫోన్లను రూ. 31,74,99 తో కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విమర్శలు వచ్చాయి. దీంతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ శుక్రవారం బల్దియా కమిషనర్ తో మాట్లాడిన విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో నిర్ణయం వాయిదా పడినట్టు తెలిసింది.
గడువు ముగినయనుండగా..
స్టాండింగ్ కమిటీ పదవీకాలం ఇంకా 53 రోజులు మాత్రమే ఉంది. ఏడు వారాలకోసం 1 లక్షా 60 వేల ఫోన్ చొప్పున ఇవ్వడమేంటని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత స్టాండింగ్ కమిటీలోని సభ్యుల్లో మొన్నటి ఎన్నికల్లో ఆరు మంది ఓడిపోయారు. ఒక సభ్యుడికి టికెట్ రాక పోటీ చేయలేదు. వీరు వచ్చే పాలకమండలిలో కొనసాగరు.
తిరిగి ఇవ్వాల్సి ఉండగా..
బల్దియా ఏ వస్తువైనా ఇస్తే అధికారులు, ప్రజా ప్రతినిలు తమ పదవీకాలం పూర్తయ్యాక తిరిగి అప్పగించాలి. కానీ లక్షల విలువైన గాడ్జెట్స్ మళ్లీ వెనక్కి రావడం లేదు. గత పాలకమండలి హయాంలో కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులతో సహా 155 మందికి విలువైన వస్తువులు అందించారు. రూల్స్ప్రకారం ఐదేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి ఇవ్వాల్సి ఉండగా, పది మందిలోపే తిరిగి ఇచ్చేశారు. ప్రస్తుత పాలకమండలితో పాటు మెజార్టీ కార్పొరేటర్లు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారే. అయినా ప్రజాప్రతినిధులమని గిఫ్ట్‌లు ఇవ్వాల్సిందే అంటున్న వారి తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి టైమ్‌లో అవసరమా..?
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వచ్చిన ఆదాయం ఉద్యోగులు, సిబ్బందికి జీతాలకే లేట్‌గా చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి పను లకు నిధుల్లేక బ్యాంకుల నుంచి రుణాలు తెస్తోంది. ఇక పాలక మండలి, ఉన్న తాధికారులు మాత్రం అదనపు ఖర్చులకు వెనుకాడట్లేదు. ఇప్పటికే కరోనా కష్టాలు, వరద నష్టాలు ప్రజలను, అధి కారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయ గా, బల్దియాకు ఆదాయం పై నా తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి టైమ్‌లో ఐ ఫోన్లు ఇవ్వడం సరికాదని బల్దియా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
For More News..