కోస్గి, వెలుగు : పాఠశాల విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండుమాల్ తహసీల్దార్ భాస్కర్ స్వామి, మాజీ ఎంపీపీ మధుకర్‌రావు సూచించారు. సోమవారం గుండుమాల్ స్కూల్లో ప్రభుత్వం, హరేకృష్ణ మూమెంట్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఎంఈవో శేఖర్‌రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ వెంకటమ్మ, హెచ్ఎం వెంకటేశ్ ఉన్నారు.