సత్తుపల్లి, వెలుగు: ఆకలితో ఉన్న నిరుపేదల కడుపు నింపేందుకు ‘ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ నిర్వహిస్తోందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొడ్డా కృష్ణయ్య, పెనుగొండ రమేశ్ తెలిపారు. ఇప్పటి వరకు17రోజులు పూర్తి కావడంతో సోమవారం బస్టాండ్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో150 మందికి అల్పాహారం అందజేశామన్నారు. ఆకలి తీర్చడం, డయాబెటిక్ రోగులకు వైద్య సేవలు, కేన్సర్ బాధిత చిన్నారులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలే లక్ష్యంగా క్లబ్ పనిచేస్తోందని చెప్పారు.
ALSO READ :వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్ దేశం లాస్ట్..విపక్షాలపై మోడీ సెటైర్లు
క్లబ్ సభ్యులతో పాటు దాతల సహకారమూ తీసుకుంటున్నామని తెలిపారు. కూలీలు, భిక్షాటన చేసేవారితోపాటు ఆకలితో ఉన్న వారికి అల్పాహారం అందిస్తున్నట్లు వారు వివరించారు. ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్ కోశాధికారి గుండు శ్రీనివాసరావు, దారా కృష్ణారావు, సోమిరెడ్డి, రవి, గోపాలరావు, సత్యనారాయణ, సిరి మురళి, రమ, జయ, పద్మిని, శిరీష, మురళీ రెడ్డి, జాశ్రిత పాల్గొన్నారు.