నార్సింగి: యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్షసాయికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నార్సింగ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షసాయిపై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
హర్ష సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతని తండ్రి రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని పిటిషనర్ను ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్కు రావాలని హైకోర్టు సూచించింది.
Also Read : 35 ఏళ్ల ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ శివ
పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యూ ట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పీఎస్లో ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం యూట్యూబ్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ హర్షసాయి పాపులర్ అయ్యాడు. ‘మెగా’ అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు. ఈ క్రమంలో తనను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు తీసుకున్నాడని అతనిపై, అతని తండ్రిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.