![హజ్ యాత్రకు వెళ్లేవారికి అలర్ట్.. రూల్స్ మారాయి.. పిల్లలు నిషేధం](https://static.v6velugu.com/uploads/2025/02/breaking-saudi-arabia-bans-children-from-hajj-2025_WZ8mMTyqiu.jpg)
2025 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికులు ఇకపై పిల్లలను పవిత్ర స్థలానికి తీసుకురావడానికి అనుమతి లేదని ప్రకటించింది. సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ అందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. పెరుగుతున్న రద్దీ కారణంగా పిల్లలను ప్రమాదాల బారి నుండి రక్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
'పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం హజ్ యాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటమే మా లక్ష్యం..అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం..' అని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో మొదటిసారివెళ్లే వారికి సడలింపు ఇచ్చింది. తొలిసారి హజ్ యాత్రకు వచ్చే యాత్రికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది.
Also Read :- దూసుకుపోయిన తులం బంగారం ధర
రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. దరఖాస్తు చేసుకోండి
2025 హజ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్ప్పటికే ప్రారంభమైంది. సౌదీ పౌరులు, నివాసితులు నుసుక్ యాప్ లేదా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వారితో ప్రయాణించే సహచరుల వివరాలు నమోదు చేసుకోవాలి.
వీసా నిబంధనల్లో మార్పు
ఇదిలావుంటే, ఫిబ్రవరి 1 నుండి సౌదీ ప్రభుత్వం వీసా నిబంధనల్లోనూ పెద్ద మార్పు చేసింది. భారతదేశం సహా 14 దేశాల నుండి వచ్చే వ్యక్తులకు సింగిల్ ఎంట్రీ వీసాలకు పరిమితం చేసింది. సరైన అనుమతి లేకుండా హజ్ తీర్థయాత్ర చేపట్టే పద్ధతిని అరికట్టడం దీని లక్ష్యమని అప్పట్లో ప్రకటన చేసింది.