Good Sleep: బ్రీతింగ్​ ఎక్సర్​సైజ్​ చేయండి... హాయిగా నిద్రపోండి.. పదికాలాల పాటు చల్లగా ఉండండి..!

Good Sleep: బ్రీతింగ్​ ఎక్సర్​సైజ్​ చేయండి... హాయిగా నిద్రపోండి.. పదికాలాల పాటు చల్లగా ఉండండి..!

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో నిద్రపట్టక పోవడం ఒకటి. రాత్రి నిద్రపోకపోతే తెల్లవారి ఏ పనీ సరిగా చేయలేరు. శరీరం అంతా నిస్పత్తువుగా ఉంటుంది. మనసూ సహకరించదు. పని ఒత్తిడి, ఆందోళనలో ఉండేవాళ్లు గాలి పీల్చడంపై ఎక్కువ దృష్టి పెట్టరు. గాలి పీల్చడం సహజంగా జరిగిపోతుంటుంది కదా అనుకుంటారు. దాంతో గుండెకు కావాల్సినంత ఆక్సిజన్ అందదు. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడానికి కారణం కూడా ఇదే అం టున్నారు వైద్యులు.

 అందుకే, నిద్రపోయే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముక్కు ద్వారా నాలుగు సెకన్లపాటు గాలిని పీల్చి, దానిని ఏడు సెకన్లపాటు ఆపి, తర్వాత ఎనిమిది సెకన్లు పాటు నోటి ద్వారా వదిలేయాలి. ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Also Read :- పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. గుండె వేగం తగ్గి హాయిగా నిద్రపడుతుంది. కేవలం రాత్రిళ్లు నిద్రపట్టక పోయినప్పుడే కాకుండా ఒత్తిడి ఎక్కువైనప్పుడు. వాంతి వచ్చినట్లు అనిపించినా, మనసు చికాకులో ఉన్నా ఈ పుల్ బ్రీత్ ఎక్సర్​ సైజ్ చేయడం వల్ల లాభం ఉంటుంది.

–వెలుగు, లైఫ్​–