ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • 5,484 ఎకరాల్లో పత్తి సాగు 
  • కలెక్టర్ అనురాగ్ జయంతి 
  • మద్దతు ధరపై అధికారులతో సమీక్ష


రాజన్న సిరిసిల్ల,వెలుగు : వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని రైతులు 5,484 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. దాదాపు 39,676 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పత్తి కొనుగోలుపై మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌, సీసీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. మద్దతు ధర కోసం వేములవాడలో 3, ఇల్లంతకుంటలో 2, బోయినపల్లిలో 1 మొత్తం 6 సీసీఐ కేంద్రాలను తెరిచామన్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌‌‌‌‌‌‌‌ పొడవు పింజ రకం పత్తికి రూ.6,380, మధ్యరకానికి రూ.6,280 నిర్ణయించిందన్నారు. రైతులు 8 నుంచి 12 శాతంలోపు తేమ శాతం ఉండాలని అప్పుడే సీసీఐ వారు కొనుగోలు చేస్తారని తెలిపారు. అనంతరం మద్దతు ధర వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నర్సయ్య, ఆర్డీఓ పవన్ కుమార్, సివిల్ సప్లై ఆఫీసర్లు జితేందర్ రెడ్డి, హరికృష్ణ, అగ్రికల్చర్ ఆఫీసర్ రణధీర్ రెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్  ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఫార్మసీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి: చైర్మన్ ముద్ధసాని రమేశ్​ రెడ్డి

తిమ్మాపూర్, వెలుగు : ఫార్మసీ ఇండస్ట్రీలో విద్యార్థులు ఉద్యోగావకాశాలను అం దిపుచ్చుకోవాలని శ్రీ చైతన్య కాలే.ఈ చైర్మన్ ముద్దసాని రమేశ్​రెడ్డి అన్నారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఫార్మసీ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. అనంతరం అంటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ప్రొఫెసర్ అప్పారావు, హెచ్ఓడీ ఆఫీసర్ కె. రాంప్రసాద్, లైబ్రరీ మీడియా ఇన్​చార్జి రమేశ్ తోపాటు వివి ధ విభాగాధిపతులు, లెక్చరర్లు, స్టూడెంట్లు 
పాల్గొన్నరు. 

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి: అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్​​

జమ్మికుంట, వెలుగు : తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి పౌష్టికాహారం అందించడం మన బాద్యత అని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి అంగన్​వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తల్లులంతా చిన్నారులను ప్రతి మంగళవారం అంగన్​వాడీ కేంద్రానికి తీసుకువచ్చి, వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ పనుల్లో వేగం పెంచాలి:జగిత్యాల కలెక్టర్ రవి

మెట్ పల్లి, వెలుగు: పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు. మంగళవారం ఖాదీ బోర్డు నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మిస్తున్న మార్కెట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో క్వాలిటీ పాటించాలని, పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. పనులను బల్దియా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, కమిషనర్ సమ్మయ్య, ఆఫీసర్లు పాల్గొన్నారు.
కోరుట్ల:  నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం కోరుట్ల మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్ రాజేశ్,  మున్సిపల్ కమిషనర్ అయాజ్​తదితరులు ఉన్నారు. 

ఎన్​సీడీ మెడికల్ కిట్లు ఇంటికెళ్లి ఇవ్వాలి: కలెక్టర్ డాక్టర్ సంగీత 

పెద్దపల్లి, వెలుగు: ఎన్​సీడీ మెడికల్ కిట్లను పీహెచ్ సీల వారీగా పేషెంట్ల ఇంటికెళ్లి ఇవ్వాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో మంగళవారం ఎన్​సీడీ మెడికల్ కిట్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులు ఉన్నవారికి ప్రభుత్వ సూచన మేరకు ఎన్​సీడీ మెడికల్ కిట్ బ్యాగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలన్నారు. బీపీ, షుగర్ బాధితులకు బుధవారం నుంచి అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ  డీఎంహెచ్​ఓ డాక్టర్ కృప తదితరులు పాల్గొన్నారు. 

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

గోదావరిఖని, వెలుగు : పట్టణంలోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. పక్కపక్కనే తాళం వేసి ఉన్న రెండు సింగరేణి క్వార్టర్లు, ఒక షెడ్డులో దొంగలు చొరబడ్డారు. బీరువాలు పగులగొట్టి ఒక క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.25 వేలు, మరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.5 వేలు అపహరించారు. సింగరేణి క్వార్టర్లకు బైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోర్లు బిగించడంతో అవి సులువుగా విరిగిపోతుండడం దొంగలకు కలిసి వస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన వారు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమాచారం ఇస్తే ఆ ఏరియాలో గస్తీ చేపడతామని గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్​స్పెక్టర్​రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు
 తెలిపారు.

బాధిత కుటుంబాలకు సునీల్ రెడ్డి పరామర్శ

ముత్తారం, వెలుగు : మంథని మండలంలోని పలు కుటుంబాలను బీజేపీ స్టేట్ లీడర్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అంబేద్కర్ నగర్​లోని ఏబీవీపీ మంథని డివిజన్ మాజీ కన్వీనర్ శివకుమార్ తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని, బోయిన్ పేటకు చెందిన మారేడుగొండా శ్రీనివాస్, ఎరవేన రాజేశం, మంథని నాయీ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు విష్ణు భక్తుల వెంకటరాజం, రామగిరి మండలం సెంటనరి కాలనీ శ్రీ కోందడ రామాలయం ప్రధాన అర్చకులు పెద్ద కుమారుడు క్రాంతి కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతులకు నివాళులర్పించారు. ఆయన వెంట మంథని పట్టణాధ్యక్షుడు సదాశివ్, మండల ఇన్​చార్జిలు సతీశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

భూగర్భ జలాలను పెంచుకుందాం- జడ్పీ చైర్ పర్సన్ వసంత

జగిత్యాల, వెలుగు: ఇంకుడు గుంతలు తవ్వుకుని భూగర్భ జలాలను పెంచుకుందామని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హల్లో ఇంకుడు గుంతల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం ఉద్యమంలా సాగాలని అన్నారు. అధికారులు, లీడర్ల సమన్వయంతో 100 శాతం నిర్మాణం పూర్తి  చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమానుజాచార్యులు, డీఆర్డీఏ వినోద్, డీపీఓ నరేశ్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 

రాజన్న సేవలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

వేములవాడ, వెలుగు: స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కు చెల్లించి, స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఆలయ సూపరింటెండెంట్ తిరుపతి రావు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎస్పీ చంద్రయ్య సజ్జనార్​కు పుష్ఫగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట డిపో మేనేజర్ భీంరెడ్డి ఉన్నారు.

ఆయిల్ పామ్ పై దృష్టి పెట్టాలి: జెడ్పీ చైర్ పర్సన్ అరుణ

రాజన్న సిరిసిల్ల,వెలుగు: రైతులు ఆయిల్ పామ్​ పంటపై దృష్టి సారించాలని జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడొద్దని మినిస్టర్​ కేటీఆర్ జిల్లాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నారన్నారు. పంట వేసిన 4 ఏళ్ల తర్వాత 25 -నుంచి 30 ఎండ్ల వరకు క్రమం తప్పకుండా పంట వస్తుందన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ కళ, కౌన్సిలర్​ రాజిరెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు. 

కరాటేలో విద్యార్థుల ప్రతిభ

జ్యోతినగర్, వెలుగు: తెలంగాణ ఇంటర్ స్టేట్ ఛాంపియన్​షిప్ పోటిలో రామగుండం ఎన్టీపీసీకి చెందిన విశ్వభారతి స్కూల్ స్టూడెంట్లు ప్రతిభ కనబరిచారు. ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో స్టూడెంట్స్ బహుమతులు అందుకున్నారు. శ్రీశాంత్ రెడ్డి, కిరణ్మయి గోల్డ్ మెడల్ సాధించగా నిత్యశ్రీ, ఆదిత్య, సిల్వర్ మెడల్ సాధించారు. మిగతా స్టూడెంట్లు అంజనీ ప్రియ, ఆద్యశ్రీ, వర్షిణి, వర్ధన్, నవదీప్​ రెడ్డి, అక్షయ్, యశ్వంత్, అక్షయ్, సుశ్రుత్ మెడల్స్ పొందారు. విశ్వభారతి స్కూల్ చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, తిరుపతి గౌడ్ మంగళవారం వారిని అభినందించారు.