- ఫారెస్ట్ ల్యాండ్‌లోనే ఊరుందట..
- శనివారంపేట గ్రామంలో సగం భూమి ఫారెస్టోళ్లదేనట
- భూమి చదును చేస్తున్నారని చింతలూర్ లో 50 మంది పై కేసు
- రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లకు సమన్వయలోపం
- ఏళ్లుగా సాగదీస్తున్న జాయింట్ సర్వే
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ఆఫీసర్ల తీరుతో ఊర్లు అడవులుగా మారుతున్నాయి. సమస్యలను పరిష్కరించాలని చేసిన భూప్రక్షాళన ఆ గ్రామాలను మరింత అయోమయంలోకి నెట్టేసింది. దశాబ్దం కాలంగా రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య జరుగుతున్న హద్దుల లొల్లి ఎటూ తేలడం లేదు. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామం లో ఇండ్ల స్థలాలు సైతం ఫారెస్ట్ ల్యాండ్‌గా నమోదు కావడం, రాయికల్ మండలం చింతలూర్ లో రెవెన్యూ ల్యాండ్ కు హద్దులు నిర్ధారించకపోవడంతో రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. చింతలూర్‌లో చెట్లు నరికి భూమి చదును చేశారని ఫారెస్ట్ఆఫీసర్లు 50మందిపై కేసు నమోదు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల ఆందోళన
గత నెల 28న జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో చెట్లను ఫారెస్ట్ భూమిలో చదును చేస్తున్నారని 50 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్ఆఫీస్ కు తరలివచ్చి ఆందోళన చేశారు. సర్వే నెంబర్ 85, 97 లో ప్రభుత్వ భూములున్నాయని, ఇందులో సర్వే నంబర్ 97 లో 2167. 37 ఎకరాల, సర్వే నం.97/1 లో 927 ఎకరాలు, సర్వే నంబర్ 97/2 లో 1147 ఎకరాలు ఉందని రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇందులో 106 మందికి 103 ఎకరాల పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం సాగు చేసుకునేందుకు వెళ్లిన తమపై కేసులు నమోదు చేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అత్యధిక ఫారెస్ట్ ల్యాండ్ ఉన్న బీర్ పూర్ మండలం చెర్లపల్లి శివారులోని సర్వే నం.60 లో 300 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ ఉంది. అప్పట్లో రెవెన్యూ ఆఫీసర్లు ఇదే సర్వే నంబర్లో 260 మందికి 850 ఎకరాలకు పట్టాలిచ్చారు. అయితే ఫారెస్ట్ ల్యాండ్ కు పట్టాలిచ్చిన ఆఫీసర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ భూముల్లో 2017-–18 లో జాయింట్ సర్వే ప్రారంభించినా రాజకీయ ఒత్తిళ్లతో బ్రేక్‌పడింది. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామం ఫారెస్ట్ల్యాండ్లో ఉందంటూ అధికారులు తేల్చి చెప్పడంతో గ్రామస్థులు జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామంలో 536.30 ఎకరాల భూమి ఉందని, వీటికి పట్టా పాస్ బుక్ లు కూడా ఉన్నాయని, తాతల కాలం నుంచి ఇండ్లు నిర్మించుకుని వ్యవసాయం చేసుకుంటామని, సగం గ్రామంతో పాటు సుమారు 300 ఎకరాల భూమి ఫారెస్ట్ డిపార్మెంట్ పరిధిలో ఉందని ఆఫీసర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జాయింట్ సర్వే చేయాలి
గతంలో చేసిన శాటిలైట్ సర్వేలో పూర్తి స్థాయిలో ఫారెస్ట్ భూములను గుర్తించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామంలోని రెవెన్యూ ల్యాండ్ ను ఆఫీసర్లు గుర్తించాలి. ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేసి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలి
- శ్రీనివాస్, సర్పంచ్, చింతలూర్, రాయికల్
చెట్లు కొట్టినవారిపై కేసులు నమోదు చేశాం
రాయికల్ మండలం చింతలూర్ గ్రామంలో 250కి పైగా చెట్లను కొట్టేసినట్లు గుర్తించాం. ఈ మేరకు చెట్లు కొట్టేసిన వారిపై కేసులు నమోదు చేశాం. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామానికి చెందిన ఫారెస్ట్ భూముల సమస్యలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
- డీఎఫ్‌వో వెంకటేశ్వర్ రావు
ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి
గన్నేరువరం, వెలుగు: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం గన్నేరువరంలో మీడియాతో మాట్లాడుతూ గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేయలేదని, పీహెచ్సీ మంజూరు చేయించలేదని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించలేదన్నారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, అందుకే ఆయనను రాజీనామా చేయాలని ఫోన్‌చేసి డిమాండ్చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునురి శంకర్ , నాయకులు బూట్ల జగన్, తిరుపతి, రాజు, తిరుపతి పాల్గొన్నారు .
టీఆర్ఎస్ పాలనలో చెరుకు రైతుల పరిస్థితి దయనీయం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురుజల రాజిరెడ్డి
మెట్ పల్లి, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో రైతుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురుజల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి ఇచ్చిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ సర్కారు మూసివేసిందని, దీంతో ఫ్యాక్టరీపై ఆధారపడిన కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డారని ఆరోపించారు. మూసివేసిన ఫ్యాక్టరీని తెరవాలని జిల్లావ్యాప్తంగా రైతులందరూ పార్టీలకతీతంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కేసీఆర్ సర్కారు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేసే వరకు సర్కారుపై రైతులందరితో కలిసి పోరాడతామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణపై ఈ నెల11 న మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గోపిడి అంజిరెడ్డి, రమేశ్, శంకర్, రాజేందర్, లింగారెడ్డి, కౌన్సిలర్ యమ రాజయ్య, లక్ష్మణ్, హరికుమార్ పాల్గొన్నారు.
- టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా
- వేములవాడ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
- బీజేపీ నేత కటకం మృత్యుంజయం
వేములవాడ, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని, సీఎం కుటుంబం కరీంనగర్ పార్లమెంట్ పరిధిని దోపిడీకి అడ్డాగా ఎంచుకున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్యేల్యే కటకం మృత్యుంజయం ఆరోపించారు. వేములవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికలో డబ్బులు పంచి గెలవడం తప్ప టీఆర్ఎస్కు వేరే మార్గం లేదని ఆ పార్టీకి అర్థమైందని ఎద్దేవా చేశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వంపై ఇప్పటికే కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినా పదవిలో కొనసాగుతుండటం సరికాదన్నారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, హరీశ్, కృష్ణ పాల్గొన్నారు.
- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
- సుడా చైర్మన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
మానకొండూర్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు పాటు క్రీడల్లో రాణించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు ఆకాంక్షించారు. మంగళవారం మానకొండూర్మండలం అన్నారం జడ్పీ హైస్కూల్లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఎంపీపీ సులోచన-, సర్పంచ్ లు కిషన్, పృథ్విరాజ్, గోపాల్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ అనిల్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు కిరణ్, లీడర్లు మధు, రామస్వామి, స్పోర్ట్స్ నిర్వహణ అధికారి శ్రీనివాస్, స్పోర్ట్స్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.
కవి శ్రీనివాస్‌కు సినారె వాగ్భూషణ పురస్కారం
కరీంనగర్ టౌన్,వెలుగు: వాక్కును వశం చేసుకుంటే రుషులవుతారని అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత నంది శ్రీనివాస్ ను ఎంపిక చేశారు. మంగళవారం స్థానిక ఫిల్మ్ భవన్ లో ఏర్పాటు చేసిన సినారె వాగ్భూషణ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్, పురస్కార కమిటీ కన్వీనర్ సేనాధిపతి, మధుసూధన్ రెడ్డి, శ్రీకర్, లక్ష్మణ్ రావు, రవీందర్, కొమురయ్య పాల్గొన్నారు.
- హాస్పిటల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం
- పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ప్రధాన హాస్పిటల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంగళవారం జడ్పీ చైర్మన్ పెద్దపల్లి హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా అనేకమందికి లబ్ధి చేకూరుతోందని, గవర్నమెంట్హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెరిగిందన్నారు. ల్యాబ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.1.5 లక్షలు అవుతున్నాయని, ప్రతినెల తన వంతుగా రూ.10వేలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
- ప్రధాని సభను సక్సెస్ చేయాలి
- బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావు
పెద్దపల్లి, వెలుగు: ఈనెల 12న రామగుండంలో ప్రధాని మోడీ పాల్గొనే సభను సక్సెస్చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు, యువత తరలిరావాలన్నారు. సమావేశంలో నాయకులు పర్వతాలు, రాజేశ్వరరావు, రవి, సంతోష్ , శ్రీనివాస్, కృష్ణ, సంపత్ రావు, దిలీప్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రాహుల్, ప్రభాకర్, ఉప్పు కిరణ్, మధు, పడాల శీను పాల్గొన్నారు.
మెట్ పల్లి, వెలుగు: ఈ నెల 12 న రామగుండంలో నిర్వహించే ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొడ్ల రమేశ్పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలు, వివిధ మోర్చాలు, బూత్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, కోరుట్ల నియోజకవర్గ లీడర్లు అరుణ, సురభి, నిజామాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ సదాశివ్, లీడర్లు సుఖేందర్ గౌడ్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
తిమ్మాపూర్, వెలుగు: సీజనల్వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దీపిక హాస్పిటల్డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో టైఫాయిడ్, మలేరియా, జ్వరాలు, దగ్గుతోపాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదముందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోనే ఆధునిక వసతులు సౌకర్యాలతో నెలకొల్పిన తమ హాస్పిటల్లో మెరుగైన చికిత్సలు అందజేస్తున్నామన్నారు.
ఘనంగా అద్వానీ జన్మదిన వేడుకలు
గోదావరిఖని, వెలుగు: బీజేపీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 95 పుట్టిన రోజు వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకుడు మామిడి రాజేశ్స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు మహవాది రామన్న, రాజు, కోటేశ్వర్లు, రవీందర్ రెడ్డి, లింగయ్య, సంపత్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
కథలాపూర్, వెలుగు: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో మంగళవారం బీజేపీ వ్యవస్థాపకుడు, అద్వానీ 95వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయురారోగ్యాలతో ఆయన క్షేమంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థించారు.
- టీఆర్ఎస్ పాలనలో చెరుకు రైతుల పరిస్థితి దయనీయం
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురుజల రాజిరెడ్డి
మెట్ పల్లి, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో రైతుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురుజల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి ఇచ్చిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ సర్కారు మూసివేసిందని, దీంతో ఫ్యాక్టరీపై ఆధారపడిన కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డారని ఆరోపించారు. మూసివేసిన ఫ్యాక్టరీని తెరవాలని జిల్లావ్యాప్తంగా రైతులందరూ పార్టీలకతీతంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కేసీఆర్ సర్కారు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేసే వరకు సర్కారుపై రైతులందరితో కలిసి పోరాడతామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణపై ఈ నెల11 న మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గోపిడి అంజిరెడ్డి, రమేశ్, శంకర్, రాజేందర్, లింగారెడ్డి, కౌన్సిలర్ యమ రాజయ్య, లక్ష్మణ్, హరికుమార్ పాల్గొన్నారు.