యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం నాసిక్ కైలాస్ మఠం పీఠాధిపతి సంహిదానంద సరస్వతీ దర్శించుకున్నారు. గర్భాలయంలో నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి పండిత గోష్టి చేశారు. మొదటిసారి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఈవో గీతారెడ్డి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ‘గండ్ర’
నరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఢిల్లీ ఐఏఎస్ ఆఫీసర్ వైవీవీజే రాజశేఖర్ మంగళవారం వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు
అందజేశారు.
అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి: కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట, వెలుగు:మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో, పట్టణాభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా, పక్కాగా అమలు చేయాలని సూచించారు. నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠ ధామాలు, తదితర పనులను స్పీడప్చేయాలన్నారు. మున్సిపాలిటీల వారీగా కమిషనర్లను పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.
ప్రగతి భవన్ ముట్టడిని సక్సెస్ చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు: కొత్త విద్యావిధానం రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ.. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిని సక్సెస్చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్ పిలుపునిచ్చారు. నల్లగొండ పట్టణంలోని సంఘం ఆఫీస్‌లో మంగళవారం పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మధు అధ్యక్షతన ‘ముట్టడి’ సన్నాహక సమావేశం నిర్వహించారు. హాజరైన సాగర్మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి పెనం మీది నుంచి పొయిలో పడ్డ చందంగా మారిందన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఇ.మధు, రాజు, రవి, సుధాకర్, కిరణ్, స్వామి, వెంకట్ పాల్గొన్నారు.
స్టూడెంట్లు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి: కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి, వెలుగు: స్టూడెంట్లు నాలెడ్జ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్పెంపొందించుకోవాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. వలిగొండలోని వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలని సూచించారు. ముందుగా ఎన్సీసీ క్యాడేట్ బృందాలు కలెక్టర్‌కు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో నోడల్ఆఫీసర్రమణి, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్, విక్రమ్ కుమార్ ఉన్నారు.
జిల్లా ఆధార్ కమిటీ ఏర్పాటు
కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ కమిటీ ఏర్పాటైంది. కన్వీనర్‌గా అడిషనల్ కలెక్టర్డి. శ్రీనివాస్‌రెడ్డి, మెంబర్లుగా డీసీపీ కె. నారాయణరెడ్డి, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ఎన్.సాయి కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ ఆఫీసర్ రామకృష్ణ, డీఈవో నారాయణరెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ కేవీ కృష్ణవేణి, పోస్టాఫీసు సూపరింటెండెంట్ వినయ్ మెంబర్లుగా ఉన్నారు. మంగళవారం జరిగిన ఫస్ట్మీటింగ్లో శిశువులకు ఆధార్ఎన్రోల్, పదేండ్లకు ఒకసారి ఆధార్ అప్డేట్, మొబైల్ నంబర్అప్డేట్, నమోదు కేంద్రాల పెంపుపై సమీక్షించారు.
రోడ్ల రిపేర్లకు రూ.59 కోట్ల ప్రపోజల్స్: ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీత
రాజాపేట, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మంగళవారం మండలంలోని చల్లూరులో ప్రెస్మీట్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు, కల్వర్టుల రిపేర్ల కోసం ప్రభుత్వానికి రూ. 59 కోట్ల ప్రపోజల్స్ పంపామని ఆమె తెలిపారు. బేగంపేట, పారుపల్లి, కాల్వపల్లి వాగులపై కల్వర్టు, బ్రిడ్జి నిర్మాణాలకు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. నెమిల అవాస గ్రామం పిట్టల గూడానికి రెండు కిలోమీటర్ల మేర మదర్ డెయిరీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి ద్వారా గతంలోనే స్వచ్ఛందంగా రోడ్డు వేయించామని సునీత చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదని, అమార్యదగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్
హాలియా, వెలుగు: నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బీసీ జనగణన చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హాలియా పట్టణ కేంద్రంలో బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో
మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పశువుల లెక్కలు కూడా చేపట్టి, బీసీల గణన చేపట్టకుండా తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. 62 శాతం ఉన్న బీసీల ప్రయోజనాలు పట్టించుకోని ఏ రాజకీయ పార్టీనైనా బొందపెడతామని, బీసీల సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్సమాధి చేస్తామని హెచ్చరించారు. బీసీ విద్యార్థుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు యాదవ్ , జిల్లా అధికార ప్రతినిధి వెంకట్, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్ష , కార్యదర్శులు మధు యాదవ్, సతీశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్ ముట్టడిని సక్సెస్ చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు: కొత్త విద్యావిధానం రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ.. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడిని సక్సెస్చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్ పిలుపునిచ్చారు. నల్లగొండ పట్టణంలోని సంఘం ఆఫీస్‌లో మంగళవారం పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మధు అధ్యక్షతన ‘ముట్టడి’ సన్నాహక సమావేశం నిర్వహించారు. హాజరైన సాగర్మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి పెనం మీది నుంచి పొయిలో పడ్డ చందంగా మారిందన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఇ.మధు, రాజు, రవి, సుధాకర్, కిరణ్, స్వామి, వెంకట్ పాల్గొన్నారు.
సొంత ఊర్ల చరిత్ర రాయడం అదృష్టం
నల్గొండ అర్బన్, వెలుగు: స్టూడెంట్లు తాము చదువుతున్న కాలేజీల్లో సొంత గ్రామాల చరిత్ర రాసే అవకాశాన్ని అదృష్టంగా భావించాలని ఎన్జీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ఘన్శ్యామ్ అన్నారు. మంగళవారం తెలంగాణ సాహిత్య అకాడమీ, కాలేజీ విద్య కమిషనరేట్ సంయుక్తంగా తలపెట్టిన ‘మన ఊరు– మన చరిత్ర’ కార్యక్రమంపై కాలేజీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ స్టూడెంట్ల చేత వారి గ్రామాల చరిత్రను రాయించడం గొప్ప కార్యక్రమం అన్నారు. కాలేజీ కోఆర్డినేటర్ డాక్టర్ వీవీ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.