ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ:  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి

నిజామాబాద్, వెలుగు: చెల్లని చెక్కులు ఇచ్చిన రైతులను మోసం చేసిన  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రైతు సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌ సూర్య నారాయణతో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణను దోచుకుంటు న్న దోపిడీ దొంగలని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గల్లీ లో ఉన్నదంతా అయిపోయిందని.. ఇప్పుడు ఢిల్లీ వైపు పోతున్నాడని, కానీ అక్కడ ఎవరూ గుర్తించడంలేదన్నారు. ఈ దేశంలో బీజేపీకి అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు 14 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారని, వారి చప్పుడుకే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కొట్టుకుపోతుందన్నారు. ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి తమ ఎంపీలు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్, ఆర్వింద్‌‌‌‌‌‌‌‌పై మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ లీడర్లు న్యాలం రాజు, మాస్టర్ శంకర్,  రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శివ ప్రసాద్,  పంచారెడ్డి లింగం,  కిషన్, అమంద్ విజయ్, దొంతుల రవి, శిలా శ్రీనివాస్,  రాజు,  కిషోర్, చందుపట్ల శ్రీనివాస్, రోషన్ పాల్గొన్నారు.

అవినీతికి అడ్డాగా భట్టాపూర్‌‌‌‌‌‌‌‌ క్రషర్‌‌‌‌‌‌‌‌

మోర్తాడ్, వెలుగు: భట్టాపూర్‌‌‌‌‌‌‌‌ క్రషర్‌‌‌‌‌‌‌‌, క్వారీ అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ నేతల కనుసన్నల్లో ఈ అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ లీడర్ మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలోని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భట్టాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వారీలో అక్రమాలు జరుగుతున్నా  ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2016లో 13 వేల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకుని ఇప్పటి వరకు దాదాపు 9.9 లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపించారు. 11 నెలల నుం చి దాదాపు రూ.51 లక్షల కరెంటు బిల్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా అధికారులు పట్టనట్టుగా ఉన్నారని, అదే ఒక సామాన్య కుటుంబం నెల బిల్లు కట్టకపోయినా ఊరుకోరన్నారు. ఇప్పటి కైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటేపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బాల్కొండ కన్వీనర్ మల్కన్నగారి మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, ఏర్గట్ల మండల ప్రెసిడెంట్ ఏలేటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

బోధన్, వెలుగు: ప్రజాసమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు బీజేపీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని ఏరాజ్‌‌‌‌‌‌‌‌పల్లి, బెల్లాల్, అమ్దాపూర్, ఊట్‌‌‌‌‌‌‌‌పల్లి, రాజీవ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తండా గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై ప్రజలు మండ్డిపడుతున్నారన్నారు. డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని మాయమాటలు చెప్పి  అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒక్కటి కూడా నేరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్​పేరుతో దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరినట్లు విమర్శించారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ అనంతరం మేడపాటి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్ల దొంగ దీక్షలు, ధర్నాలు. రైతులను, ప్రజలను మరోసారి  మోసం చేయడానికే అన్నారు. రూ.152 కోట్లు ఉపాధి నిధులను నిబంధనాలకు విరుద్ధంగా దారి మళ్లించి, కేంద్రంపై నిందలు మోపడం విడ్డురంగా ఉందన్నారు. ఆయన వెంట బీజేపీ నేత వడ్డి మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, జిల్లా  కార్యదర్శి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చారి, నాయకులు అశోక్​గౌడ్, కమలాకర్, లచ్చప్ప, పోశెట్టి పాల్గొన్నారు. 

రెసిడెన్షియల్​ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఫుడ్​పాయిజన్‌‌‌‌‌‌‌‌
ఉప్మాలో పురుగులొచ్చాయన్న స్టూడెంట్లు

ఎల్లారెడ్డి, వెలుగు: అల్పాహారం తిని అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. శుక్రవారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో దొడ్డు రవ్వ ఉప్మాను అల్పాహారంగా పెట్టారు. తిన్న తర్వాత కొద్దిసేపటికి కొంతమంది పిల్లలు వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో స్కూల్ సిబ్బంది డార్మెటరీ రూంలోకి తీసుకెళ్లి  స్థానిక ఏఎన్ఎంతో మందులు ఇచ్చి వారిని రెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉంచారు. అయితే ఉప్మాలో పురుగులు రావడం వల్లే ఇలా జరిగిందని స్టూడెంట్లు చెబు తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎల్లారెడ్డి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సుభాష్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్టూడెంట్లను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవనణను పరిశీలించి స్కూల్ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు. స్టూడెంట్లకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

శ్రీకాంత్ డెత్ మిస్టరీని త్వరలో ఛేదిస్తాం': సీసీఎస్ ఏసీపీ రమేశ్‌‌‌‌​

బోధన్, వెలుగు: మండలంలోని ఖండ్‌‌‌‌గావ్ గ్రామానికి చెందిన డీగ్రీ స్టూడెంట్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌ డెత్ మిస్టరీని త్వరలో చేధిస్తామని సీసీఎస్ ఏసీపీ రమేశ్‌‌‌‌ చెప్పారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ప్రెస్​మీట్ నిర్వహించారు. శ్రీకాంత్ మృతిపై అన్ని కోణాల్లో వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. శ్రీకాంత్ డెడ్​బాడీ పూర్తిగా కుళ్లిపోవడంతో ఆధారాలు సేకరించడానికి సమయం పడుతుందన్నారు. ఘటనా స్థలంలో దొరికిన సెల్​ఫోన్ తుప్పుపట్టిపోవడంతో సమాచారం సేకరణలో ఆలస్యం అవుతుందన్నారు. మరోసారి వైద్య బృందాన్ని రప్పించి శ్రీకాంత్ మృతి చెందిన స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు రావడం ఆలస్యం అవుతుందన్నారు. విచారణ కోసం టాస్క్‌‌‌‌ ఫోర్స్​ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ను నియమించినట్లు చెప్పారు. డెత్ మిస్టరీని త్వరలోనే తెలుస్తామన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అది తమ పరిధిలో లేదని చెప్పారు.  

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి

భిక్కనూరు, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చనిపోయిన ఘటన భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద జరిగింది. ఎస్సై హైమద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా తాండూరుకు చెందిన మోరె నాగరావు (55) తన స్వగ్రామం నుంచి హైదారబాద్‌‌లో ఉంటున్న తన కొడుకు శ్రీధర్ వద్దకు వెళ్లేందుకు శుక్రవారం నిర్మల్ నుంచి కామారెడ్డి వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌‌ వెళ్తుండగా బస్సు భిక్కనూరు టోల్​ప్లాజా వద్దకు రాగానే నాగరావుకు గుండె పోటు రావడంతో కూర్చున్న సీటులోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కండక్టర్ టోల్​ప్లాజా సిబ్బంది సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా వారు 108 అంబులెన్స్‌‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్​ సిబ్బంది పరీక్షించి, నాగరావు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో డేడ్​బాడీని కామారెడ్డి గవ ర్నమెంట్​ హాస్పిటల్‌‌కు పంపి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై వివరించారు.